చిరంజీవి బ్లాక్ బస్టర్ స్టోరీని విన‌కముందే రిజెక్ట్ చేసిన రవితేజ.. కార‌ణం ఏంటంటే..?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో వాల్తేరు వీరయ్య ఒకటి. చిరు రీయంట్రి తర్వాత మల్టీస్టార‌ర్‌గా వ‌చ్చిన ఈ సినిమా బ్లాక్ బ‌స్టర్ గా నిలిచింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మించారు. ఈ సినిమా చిరంజీవి, రవితేజ కాంబోలో తరుకెక్కిన సంగతి తెలిసిందే. అయితే వాల్తేరు వీర‌య్య మూవీని రవితేజ మొదట రిజెక్ట్ చేశారని డైరెక్టర్ బాబీ వివరించాడు. ఆ స్టోరీ రెడీ అయిన టైంలో రవితేజ రోల్ లేదని దాంతో ఆ మూవీ విషయంలో నాకు కాస్త అసంతృప్తిగా అనిపించిందని.. రవితేజ ఉంటే బాగుండేదని నేను అనుకున్నాను అంటూ వివరించారు.

ఆ మెగా హీరోతో సినిమా చేస్తాను.. డైరెక్టర్ బాబీ కామెంట్స్ వైరల్ - Director  Bobby Talks About His Next Movie With Mega Hero

ఆయన మాట్లాడుతూ పవర్ సినిమాకు వర్క్ చేసే ఛాన్స్ రవితేజ నాకు ఇచ్చారని.. నేను పెన్ పట్టుకున్నప్పుడల్లా ఆయన నాకు గుర్తుకు వస్తారంటూ చెప్పుకొచ్చాడు. వాల్తేరు వీరయ్య షూట్ 80% పూర్తయిన తర్వాత ఆ ప్రాజెక్టులోకి రవితేజను తీసుకొద్దామని మా టీమ్‌కు చెప్పారని.. తర్వాత మార్చిన కథను చిరంజీవికి చెప్పాక ఆయన కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బాబి వివరించాడు. నిర్మాతలు కూడా మిస్ ఫైర్ కాకుండా చూసుకోమని చెప్పకు వచ్చారంటూ కామెంట్లు చేశాడు.

Chiranjeevi | Chiranjeevi and Ravi Teja's new movie Waltair Veerayya to  release on January 13 - Telegraph India

రవితేజ మొదటి చిరంజీవి సినిమాను క‌థ న‌చ్చ‌క‌ నేను రిజెక్ట్ చేసానంటే అస‌లు బాగోదు అంటూ కథ వినకుండానే బాబికి నో చెప్పేసాడని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత నచ్చకపోతే చేయొద్దని రవితేజకు చెప్పానని.. దీంతో రవితేజ కథ విని నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆయన వివరించాడు. ఇలా మా కాంబినేషన్ కుదిరిందని బాబి చెప్పుకొచ్చాడు. బాలయ్య – బాబి కాంబోలో ప్రస్తుతం మూవీ షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూల సందడి చేసిన బాబి ఈ విషయాలన్నీ షేర్ చేసుకోవడంతో ప్రస్తుతం ఈ కామెంట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.