జర్మనీకి సోలో ట్రిప్ వెళ్ళిన మహేష్.. కారణం ఏంటంటే..?

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు ఏ రేంజ్ లో ఇంపార్టెన్స్ ఇస్తాడో.. కుటుంబానికి కూడా అదే రేంజ్ లో ఇంపార్టెన్స్ ఇస్తాడని అందరికీ తెలుసు. ఏడాదిలో మహేష్ ఫ్యామిలీతో ఎన్నో వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇక‌ ఈవెంట్స్ కానీ ట్రిప్స్‌ కానీ నమ్రత లేకుండా మహేష్ కనిపించడు. అయితే చాలా రేర్‌గా మహేష్ సోలో ట్రిప్స్ వేస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా అలాంటి ఓ సోలో ట్రిప్‌కు మహేష్ ప్లాన్ చేశాడు. తాజాగా మహేష్ జర్మనీ ఫ్లైట్ ఎక్కాడు.

Mahesh heads to Germany for SSMB29 | cinejosh.com

ఇక ఈ సోలో ట్రిప్ వెనుక కారణమేమై ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ఈ ట్రిప్ వెనుక రాజమౌళి హ‌స్తం ఉంది అంటూ కొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడది మహేష్ గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకున్నాడు. అయినా ఈ సినిమా బ్లాక్ బ‌స్టర్ కలెక్షన్లను రాబడుతుంది. గుంటూరు కారంలో మహేష్ నటన, డ్యాన్స్.. నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Mahesh Babu's 'Guntur Karam': Intense Action Begins! - Gold Andhra News:  Andhra News, Politics, Movies, Celebrities and more

ఈ సినిమా తర్వాత మహేష్, రాజమౌళి కాంబోలో.. SSMB29 సినిమాకు మహేష్ రెడీ అవుతున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్‌లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఎలాగూ గుంటూరు కారం రిలీజ్ కూడా పూర్తి అవ్వడంతో మహేష్‌ను పూర్తిగా జక్కన్న తన కంట్రోల్లోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. సినిమా కోసం వీరిద్దరూ ఇప్పటికే పనులు మొదలుపెట్టారట. ఈ సినిమాకు సంబంధించిన ఇంపార్టెంట్ వర్క్ కోసమే మహేష్ జర్మనీకి సోలో ట్రిప్ వెళ్ళాడు అని సమాచారం.

Mahesh Babu starts prep for Rajamouli's next, leaves for Germany, here's  what we know

ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ను.. కొత్త టెక్నాలజీని.. జక్కన్న వాడబోతున్నాడట. ఇక జర్మనీలో వారిని కలిసి కొంతమేరకు గ్రౌండ్ వర్క్ చేయడం కోసమే మహేష్‌ను అక్కడకు పంపినట్లు సమాచారం. దీనికోసం మహేష్ మూడు రోజులు జర్మనీలో ఉండబోతున్నాడట. దీని తర్వాత ఇండియా వచ్చిన మహేష్ మరోసారి గుంటూరు కారం సక్సెస్ సెలబ్రేషన్స్‌లో మెరవ‌బోతున్నాడని తెలుస్తుంది. ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే టీం క్లారిటీ ఇచ్చేవరకు వేచి చూడాల్సిందే.