” పుష్ప 2 ” పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌ చేసిన రష్మిక మందన..!

అల్లు అర్జున్ లేటెస్ట్ గా నటిస్తున్న మూవీ ” పుష్ప 2 ” పై అందరికీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటించిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీలో ఐటమ్ సాంగ్ గురించి ఇప్పటికే పలు ప్రచారాలు జరుగుతున్నాయి.

వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని ఆగస్టు 15న గ్రాండ్ లెవెల్ లో ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు మేకర్స్. అసలు మేటర్ ఏమిటంటే.. తాజాగా ఓ బాలీవుడ్ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక పుష్ప 2 మూవీ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈమె మాట్లాడుతూ..” పుష్ప 1 భారీ విజయంతో మా మీద మరింత రెస్పాన్సిబిలిటీ ఏర్పడింది.

దానిని ఏమాత్రం తగ్గకుండా ఆడియన్స్ కి మంచి అవుట్ పుట్ అందించేందుకు పుష్ప 2 టీం మొత్తం ఎంతగానో కష్టపడుతున్నాం. ఇప్పుడే పుష్ప 2 కి సంబంధించిన ఓ సాంగ్ షూట్ పూర్తి చేసుకుని వచ్చాను. అది ఎంతో అద్భుతంగా వచ్చింది. ఇదొక నెవర్ ఎండింగ్ స్టోరీ. దీనిని మీరు జయంగా గాని అలానే పలు ఇతర విధాలుగా ఎంజాయ్ చేస్తూ ఆనందించవచ్చు ” అంటూ చెప్పుకొచ్చింది రష్మిక మందన. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతుంది.