సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ కి సాలిడ్ అప్డేట్ అందించిన విష్ణు విశాల్..!

యువ నటీనటులు విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలలో ఐశ్వర్య, రజనీకాంత్ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కనున్న సాలిడ్ మూవీ ” లాల్ సలాం “. ఈ మూవీలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఓ కీల‌క‌ పోషిస్తున్న సంగతి తెలిసిందే.

వాస్తవానికి సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి రావాల్సిన ఈ మూవీ కొన్ని అన్ని నివారణ కారణాలు మూలంగా ఫిబ్రవరి 9కి షెడ్యూల్ అయింది. ఇక అసలు విషయం ఏమిటంటే.. తాజాగా నటుడు విష్ణు విశాల్ మాట్లాడుతూ.. ఈ మూవీ యొక్క కథ, కథనాలతో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్ గారి పాత్ర కూడా అదిరిపోతుందని.. స్క్రీన్ పై ఆయన యాక్టింగ్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతారని చెప్పాడు.

అలానే ఈ ప్రాజెక్టులో తాను కూడా ఒక భాగం అయినందుకు తమకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఇక ప్రస్తుతం ఈయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈ సినిమాపై రజనీకాంత్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా కనుక హిట్ అయితే రజనీకాంత్ కెరీర్ పూర్తిగా మారిపోతుందని చెప్పొచ్చు.