ఊరు పేరు భైర‌వ‌కోన ఈగిల్ సినిమాతో క్లాష్.. వెనక్కి తగ్గలేమంటున్న సందీప్ కిషన్..

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న తాజా మూవీ ఊరు పేరు భైరవకోన. ఇక గతంలో వీఐ ఆనంద్ ఒక్క క్షణం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, డిస్కో రాజా లాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలను తెరకెక్కించి పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇక తాజాగా విడుదలైన ఊరు పేరు భైరవకోన మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఫాంటసీ థ్రిల్లర్ సినిమాగా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

గరుడ పురాణంలో కనిపించకుండా పోయిన ఆ నాలుగు పేజీలో ఈ భైరవకోన అంటూ వ‌చ్చిన‌ ట్రైలర్ తో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచారు మేకర్స్. దీంతో సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ సినీ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి రోజు నుంచి డ్రాప్ అయిన ఈగిల్ సినిమా కూడా ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది. దీంతో రవితేజ సినిమాకు మరోసారి క్లాష్‌ ఎదురవుతుంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ కిషన్ దీనిపై స్పందించాడు. ఊరు పేరు భైరవకోన సినిమాని వాస్తవంగా సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నం.. కానీ అ డేట్‌లో చాలా సినిమాలు ఉండడంతో వెనక్కి తగ్గాం.

ఫిబ్రవరి 9న రిలీజ్ చేయాలని భావించాం కానీ అప్పటికే టిల్లు స్క్వేర్ రేస్‌లో ఉంది. ఇక ఆ సినిమా మేకర్ తో మాట్లాడుకుని మేము అదే డేట్ ను ఫిక్స్ చేశాం. ఇలాంటి నేపథ్యంలో మళ్లీ రిలీజ్ డేట్ మార్చుకునే అవకాశం లేదు. ఈ సినిమా విషయంలో ఇప్పటికే చాలా ఆలస్యమైంది. రవితేజ తో డైరెక్టర్ విఐ ఆనంద్ కూడా పనిచేశారు. ఆయనను ఇష్టపడిన వారు ఎవరు ఉండరు. అదే విధంగా ఈగిల్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తోను మా ప్రొడ్యూసర్ కు మంచి స్నేహమే ఉంది.

ఈగిల్ రిలీజ్ విషయంలో మాకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. వాళ్ళు మాతో టచ్ లో కూడా రాలేదు. వారి నుంచి ఫోన్ వచ్చుంటే మేము రెస్పాండ్ అయ్యే వాళ్ళమే.. ఎన్ని జరిగినా ఫిబ్రవరి 9న ఈ సినిమా వస్తుందని ఫిక్స్ అయ్యాం. మరోసారి విడుదల తేదీ మారిస్తే మాకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.. కనుక ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ డేట్ మార్చే అవకాశం లేదు అంటూ క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో ఊరు పేరు భైరవకోన, ఈగిల్‌ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి.