ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘ సలార్ ‘ ఓటీటీ డేట్ ఫిక్స్..

పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్ హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా రోజురోజుకు అభిమానులను రెట్టింపు చేసుకుంటూ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఇక ప్రభాస్ తాజాగా నటించిన మూవీ సలార్. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో శృతిహాసన్, పృధ్విరాజ్ సుకుమారన్‌, శ్రియ రెడ్డి, ఈశ్వరి రావు, జగపతిబాబు తదితరులు కీలకపాత్రలో నటించి మెప్పించారు.

క్రిస్మస్ కానుకగా గత ఏడాది డిసెంబర్ 22న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుని బాక్సాఫీస్ వద్ద రూ.700 కోట్లకు పైగా గ్రాస్ వ‌శుళ‌ను కొల్లగొట్టింది. ఇక ఈ సినిమాతో వరుస ప్లాస్‌లు ఎదురవుతున్న ప్రభాస్‌కు ఊరట లభించింది. ప్రభాస్ ప్రస్తుతం క‌ల్కి 2898 ఏడి, ది రాజా సాబ్ సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్నాడు. ఇక సలార్ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ అంత ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఆ శుభ ఘడియలు రానే వచ్చాయి.

జనవరి 20వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ లో సలార్ సినిమా స్ట్రీమింగ్ కానుంది. 19వ తారీఖు రాత్రి 12 గంటల నుంచి సలార్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మ‌ళ‌యాళ‌ భాషల్లో కూడా సలార్ రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ న్యూస్‌ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా స్ట్రీమ్ అవుతుందని అంత భావించారు అయితే అంతకంటే ముందే ఓటీటీలోకి సలార్ రిలీజ్ చేసిన నెట్‌ఫ్లిక్స్ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది.