బింబిసార 2 నుంచి నేను తప్పుకోవడానికి కారణం అదే.. వ‌శిష్ఠ క్లారిటీ..

వరుస ఫెయిల్యూర్‌ల‌తో సతమతమైన కళ్యాణ్ రామ్‌కు ఒకసారిగా బిగెస్ట్ హిట్ ఇచ్చిన మూవీ బింబిసార. ట్రైమ్‌ ట్రావెల్, ఫాంటసీ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చింది. ఇక ఈ సినిమాకు వశిష్ట దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మూవీ ఊహించిన దానికంటే పెద్ద హిట్ కావడంతో దీనికి సీక్వెల్ గా మరో సినిమాను కూడా మేకర్స్ ప్రకటించారు. కానీ అనుకోకుండా పార్ట్ 2 డైరెక్టర్‌గా వశిష్ట ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. దీంతో గతంలో వశిష్ట తప్పుకోవడానికి కారణాలు ఇవే అంటూ పలు రకాల వార్తలు, వైరల్ అయ్యాయి.

ప్రస్తుతం వశిష్ట చిరంజీవితో విశ్వంభ‌ర సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో వశిష్ట మాట్లాడుతూ బింబిసార సీక్వెల్‌లో తప్పుకున్న‌ విషయంపై క్లారిటీ ఇచ్చేశాడు. రామ్ చరణ్ తో నేను బాహుబలి లాంటి సినిమాను తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.. అందులో అసలు నిజం లేదు.. గతంలో నేను ఎప్పుడు అసలు ఆ విషయాన్ని మాట్లాడలేదు.. అదేవిధంగా నేను మెగాస్టార్ చిరంజీవితో జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి ఫాంటసీ సినిమా చేయాలనుంది అని చెబితే.. రామ్ చరణ్ తో వశిష్టత త్వరలోనే సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు రాశారంటూ చెప్పుకొచ్చాడు.

నాకు ఫాంటసీ స్టోరీస్ అంటే చాలా ఇష్టం.. అందుకే బింబిసారా సీక్వెల్ నేను చేయడం లేదు. పార్ట్ 2 కథ విషయంలో నా ఆలోచనలు వేరుగా ఉన్నాయి. దాని గురించి డిస్కషన్స్ జరుగుతున్న టైం లోనే నాకు విశ్వంభర ఛాన్స్ వచ్చింది. ఈ విషయాన్ని కళ్యాణ్ రామ్ గారితో చర్చించి ఆయన అనుమతి తీసుకున్న తర్వాతే బింబిసార నుంచి తప్పుకొని విశ్వంభరా ప్రాజెక్టుకు నేను షిఫ్ట్ అయ్యా అంటూ చెప్పుకోవచ్చాడు. చిరంజీవితో విశ్వంభరా సినిమాని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు వశిష్ట. సంక్రాంతి కానుకగా ముల్లోకాల కాన్సెప్ట్ తో ట్రైల‌ర్ రిలీజై అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. 2025 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది.