డ్యాన్స్ స్టెప్పులతో అదరగొట్టిన లావణ్య, నిహారిక.. ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారంటూ..

మెగా సంక్రాంతి సంబరాలు బెంగళూరులో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. బెంగళూరు ఫామ్ హౌస్ లో మెగా ఫ్యామిలీ అంతా కలిసి మూడు రోజులు సందడి చేశారు. అటు అల్లు ఫ్యామిలీ కూడా పండుగను ఎంతో ఆహ్లాదంగా జరుపుకున్నారు. పవన్ కళ్యాణ్ తప్ప మెగా ఫ్యామిలీ మొత్తం వేడుకలకు హాజరయ్యారు. ఇక పండగ పూర్తి కావడంతో ఇటీవల హైదరాబాద్‌ చేరుకున్నారు మెగా ఫ్యామిలీ. పండగ రోజు ఉపాసన అక్కడ జరిగిన విశేషాలను లైవ్ అప్డేట్స్ ఇస్తూ తన ఇన్స్టా వేదికపై ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. అదేవిధంగా ఇంటికి వచ్చిన తర్వాత కూడా కజిన్స్ తో దిగిన ఫోటోలను, వీడియోలను షేర్ చేసుకుంది ఉపాసన.

Mega daughter and Mega daughter-in-law's dance video goes viral | 123telugu.com

ఇక మెగా ఫ్యామిలీలో నిహారిక అంటే ఎంతో స్పెషల్. అవ్వడానికి నాగబాబు కూతురు అయినప్పటికీ మెగా ఫ్యామిలీ మొత్తానికి నిహారిక ప్రిన్సెస్. ఇక ప్రస్తుతం నిహారిక యాక్టర్ గాను, ప్రొడ్యూసర్ గాను మంచి స్టేజ్ కు రావడానికి ప్రయత్నాలు చేస్తోంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన మనసుకు నచ్చిన‌ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ముందుకు సాగుతుంది. గతేడాది నిహారిక అన్న.. వరుణ్ తేజ్, సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠికి ఘనంగా వివాహం జరిగిన సంగ‌తి తెలిసిందే. వరుణ్, నిహారికకు తన బెస్ట్ ఫ్రెండ్ ని వదినగా ఇంటికి తెచ్చాడు.

Mega Daughter in Law and Daughter dancing temptation | cinejosh.com

పెళ్ళికి ముందు నుంచి కూడా నిహారిక, లావణ్య మంచి ఫ్రెండ్స్. పెళ్లి తర్వాత కూడా వారు అంతే స్నేహంగా ఉంటున్నారు. ఇక తాజాగా జరిగిన సంక్రాంతి సంబరాల సందడిలో హడవిడంతా ఈ వ‌దినా మరదళ్లదే కనిపించింది. ఈ వేడుకల్లో వదినా మరదలు ఇద్దరూ డ్యాన్స్ చేస్తూ స్టెప్పులు అదరగొట్టారు. బాబాయ్ పవన్ కళ్యాణ్ సాంగ్‌కు నేహా, లావణ్య డ్యాన్స్ చేస్తూ మెప్పించారు. నిహారిక తన కజిన్స్ తో చేసిన అల్లరి మొత్తం ఈ ఫోటోలలో కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ పిక్స్, వీడియోస్ నెట్టింట‌ తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ వదినా మరదలు డ్యాన్స్ చూడమచ్చటగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్‌.

 

View this post on Instagram

 

A post shared by Niharika Konidela (@niharikakonidela)