‘ స‌లార్ ‘ సెకండ్ ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. కేజీయ‌ఫ్‌ను మించిన ఊచ‌కోత ( వీడియో )

పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో సలార్‌ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 22న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తెలుగు వర్షన్ ట్రైలర్ కు ఏకంగా 44 మిలియన్ల అందుకోగా.. సలార్ మిగిలిన అన్ని భాషల్లో మంచి వ్యూస్ ను సంపాదించుకుంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Prabhas-starrer film Salaar: Part 1 – Ceasefire to have Diwali release this  year

నిన్న మొన్నటి వరకు చాలా సీదా సాదాగా ప్రమోషన్స్ జరుగాయి. దీంతో సినిమా ఊహించిన రేంజ్ లో వర్కౌట్ కాలేదని.. అందుకే ఈ సినిమా ప్రమోషన్స్ కూడా ఎక్కువగా జరపడం లేదంటూ వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా సలార్ ప్రమోషన్స్ జాతర మొదలైంది. సలార్ నుంచి రెండో ట్రైలర్ ఫైనల్ టచ్ కోసం రిలీజ్ చేశారు మేకర్స్. మొదట 10: 42 నిమిషాలకు రిలీజ్ చేస్తామని చెప్పిన మూవీ టీం కాస్త‌ ఆలస్యం తర్వాత 3: 42 నిమిషాలకు రిలీజ్ చేశారు.

రిలీజ్ అయిన 10 నిమిషాల్లోనే లక్షల వ్యూస్ అందుకుంటూ దూసుకుపోతుంది. దీన్ని బట్టి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఏ రేంజ్ లో హైప్ నెల‌కొందో అర్ధం చేసుకోవ‌చ్చు. 15 నిమిషాల్లో ఏకంగా 8 లక్షల వ్యూస్ అంటే.. సలార్ కోసం ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారు ఇప్పటికే అర్థమై ఉంటుంది. అదిరిపోయే విజువల్స్, మాస్ యాక్షన్ సీన్స్, ఫైట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. గూస్ బ‌మ్స్ తెప్పించే రేంజ్ లో ఉన్నాయి. ఈ ట్రైలర్ మొత్తంలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ గా చెప్పవచ్చు. మ్యాసివ్‌ యాక్షన్ తో అదరగొట్టిన ఈ ట్రైలర్ దెబ్బతో ఈ మూవీ కచ్చితంగా కేజియ‌ఫ్ రికార్డ్‌ల‌ను బ్రేక్ చేయ‌డం ఖాయ‌మ‌నిపిస్తుంది. ఇక మరో నాలుగు రోజుల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ద‌మౌతుంది.