అందరిని రిజెక్ట్ చేసే సాయి పల్లవి సినిమా,, రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఇతనే.. పోలా అద్దిరిపోలా..!

సాయి పల్లవి .. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ మలయాళీ బ్యూటీ ఇండస్ట్రీలో ఉండే టాప్ హీరోయిన్లకి కూడా చెమటలు పట్టిస్తుంది . ఎక్స్పోజింగ్ లేకుండా వల్గర్ లేకుండా పద్ధతిగా రోల్స్ చేస్తూ ముందుకు వెళ్తున్న సాయి పల్లవి చాలామంది స్టార్ హీరోలను రిజెక్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే సాయి పల్లవి అందరి హీరోలను రిజెక్ట్ చేస్తూ వస్తే ..

 

సాయి పల్లవి సినిమానే ఓ స్టార్ హీరో రిజెక్ట్ చేయడం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . సాయి పల్లవి ఎంతో ఇష్టంగా తీసుకొని నటించిన సినిమా విరాటపర్వం. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రానా దగ్గుబాటి హీరోగా నటించాడు . అయితే ఈ సినిమాలో రానా దగ్గుబాటి పాత్రకు ముందుగా గోపీచంద్ ని అనుకున్నారట మేకర్స్ .

అయితే కథ విన్న తర్వాత ఆయనకు ఈ కథ ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అని తెలిసి రిజెక్ట్ చేశారట . ఆయన అనుకున్నట్లే ఈ సినిమా డిజాస్టర్ గా మారింది . కానీ సాయి పల్లవి రానా దగ్గుబాటి నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో గోపీచంద్ – సాయి పల్లవి సినిమాను రిజెక్ట్ చేశాడు అన్న వార్త వైరల్ అవుతుంది. ప్రజెంట్ సాయి పల్లవి పలు సినిమాలల్లో నటిస్తూ దూసుకుపోతుంది..!!