ఫైనల్లీ ..లవ్ మ్యాటర్ ని బయట పెట్టిన శ్రీలీల.. కాబోయే మొగుడు ఆ యంగ్ హీరోనా..?

సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే హీరోయిన్ శ్రీలీల పేరే ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అటు ఇటుగా ఉంటున్నా సరే మేకర్స్ మాత్రం శ్రీలీలనే తమ సినిమాలో హీరోయిన్గా పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . ఇప్పటికీ ఆమె చేతిలో పది సినిమాలకు పైగా ఉన్నాయి అంటే ఆమె క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు .

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రీ లీల తనకు కాబోయే భర్తకు ఉండాల్సిన క్వాలిటీస్ గురించి ఓపెన్ గా చెప్పుకొచ్చింది. ఇవే కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి . అంతేకాదు శ్రీ లీల ఎవరినో లవ్ చేసింది అని వస్తున్న వార్తలకు పరోక్షకంగా చెక్ పెట్టేసింది. తనకు కాబోయే భర్త మంచి హాస్య చతుర్యత కలిగి ఉండాలి అని ..తనను బాగా ఇష్టపడాలి అని ..

Actress Sree Leela Pictures @ Dhamaka Movie Press Meet

ముఖ్యంగా తన అమ్మకు బాగా నచ్చాలి అని చెప్పుకొచ్చింది. అంతేకాదు ఈ మూడు క్వాలిటీస్ కూడా ఓ యంగ్ హీరోలో ఉన్నాయి . ఆ యంగ్ హీరోతో అమ్మడు చాలా క్లోజ్ గా మూవ్ అవుతుంది . ఈ క్రమంలోనే పరోక్షకంగా ఆ హింట్ ఇచ్చేసింది అంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు . మొత్తానికి లవ్ మేటర్ ని బయటపెట్టి శ్రీ లీల మరోసారి ఇండస్ట్రీలో సెన్సేషన్ గా మారిపోయింది..!!