నాకు రూ.45 లక్షలు ఇస్తే హౌస్ నుంచి నేనే వెళ్ళిపోతా.. బిగ్ బాస్ అమర్ సెన్సేషనల్ కామెంట్స్..

బిగ్‌బాస్ సీజన్ సెవెన్ తెలుగు హీరోస్ తో అంతిమపోరు ముగియనుంది. టైటిల్ ఎవరు గెలుచుకుంటారు అనే అంశంపై ప్రేక్షకులకు బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఫినాలే ఎపిసోడ్ అంటే హౌస్ లో ఉండే కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యుల్లో హడావిడి మొదలైపోతుంది. బిగ్బాస్ సీజన్ సెవెన్ చూస్తే మాత్రం అలాంటివి ఏమీ కనిపించడం లేదు. మరీ తాజాగా శనివారం జరిగిన హైలెట్స్ గురించి ఇప్పుడు మనం ఓ లుక్కేద్దాం. ఈరోజు ఫైనల్ ఎపిసోడ్ కావడంతో నిన్న శనివారం నాగార్జున రాలేదు. ఇక ఇంట్లో ఉన్న ఆరుగురు తో టైం పాస్ చేయాలని ఫిక్స్ అయిన బిగ్ బాస్ చిన్నపిల్లల ఆటలు పెట్టాడు.

Bigg Boss Telugu 3: Sreemukhi reveals the reason behind quitting academics  and foraying into TV - Times of India

కళ్ళకు గంతులు కట్టుకుని ఎవరు కట్టారో చెప్పుకోండి చూద్దాం అనే కొత్త గేమ్ లో ప్లాన్ చేశాడు. అయితే ఇది ఊహించినంతగా ఎంటర్టైన్మెంట్ కాలేదు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న వాళ్లను ఇమిటేట్ చేసి చూపించాలని బిగ్ బాస్ కొన్ని ఇన్సిడెంట్స్‌ వివరించాడు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అర్జున్.. రైతుబిడ్డ ప్రశాంత్, అమర్‌లా యాక్ట్‌ చేసి చూపించాడు. అలాగే ప్రియాంక కూడా శివాజీ కాఫీ ఇవ్వకపోతే బయటికి వెళ్లిపోతాను అంటూ చేసిన హడావిడిని రీ క్రియేట్ చేసి చూపించింది. దీంతో ఈమెకు మంచి మార్కులు పడ్డాయి.

తర్వాత త్వరలో ప్రారంభమయ్యే సూపర్ సింగర్ కొత్త సీజన్ ప్రమోషన్స్ కోసం హౌస్ లోకి వెళ్ళిన శ్రీముఖి కాసేపు ఆరుగురు ఇంటి సభ్యులతో పాటలు పాడించి, ట్రూత్ డేర్ గేమ్ ను ఆడించింది. అయితే ఈ గేమ్‌ కూడా ప్రేక్షకులు అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ ఆటలో భాగంగా శివాజీని.. శ్రీముఖి ఒక ప్రశ్న అడగ్గా బయటకి వెళ్ళిన తర్వాత న‌య‌ని పావ‌నితో బాండింగ్ పెంచుకుంటా అంటూ వివరించాడు. ర‌తిక‌ ఓసారి ఎలిమినేట్ అయ్యి హౌస్ లోకి తిరిగి వచ్చిన మెచ్యూర్డ్ గేమ్ ఆడలేదని చెప్పుకొచ్చాడు. ఇక ప్రతి సీజన్లో లాగే ఫినాలేకి ఓ రోజు ముందు హౌస్ లో బిగ్ బాస్ డబ్బులు సూట్కేస్‌ పంపించడంతో మొదలైన పాట.. పది లక్షల వరకు వెళ్ళింది.

Bigg Boss Telugu 7 Nominations: Amar, Arjun Or Priyanka; Which Contestant  Will Go Into Danger Zone This Week? Find Out

కానీ ఎవరు ఆ డబ్బులు తీసుకోవడానికి ఆసక్తి చూపించలేదు. ఈ మొత్తం చాలా టెంప్టింగ్‌గా ఉన్నప్పటికీ.. ఎవరు దాన్ని తీసుకోలేదు. అయితే ఈ వేలం పాట జరుగుతున్నప్పుడు శివాజీ, అర్జున్, అమరతో చిన్న డిస్కషన్ పెట్టాడు. ఎంత కావాలి.. ఎంత కావాలి.. అని అడగగా రూ.40 లక్షలు ఇస్తే నేను వెళ్ళిపోతా అంటూ అర్జున్, రూ.45 లక్షలు ఇస్తే వెళ్ళిపోతా అంటూ అమర్ చెప్పుకొచ్చారు. ఇక చివరిగా ప్రియాంక ఇంటి నుంచి ఫుడ్ రావడంతో ఎపిసోడ్ ముగిసింది. ఈరోజు ఎపిసోడ్ లో టైటిల్ విన్న‌ర్ ఎవ‌రో తేలిపోనుంది.