లవ్‌లో పడిన సమంత.. ఏకంగా కిస్ చేస్తూ అలా ఎంజాయ్ చేస్తున్న వీడియో లీక్‌..

సౌత్ స్టార్ బ్యూటీ సమంత.. ఏం మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే హిట్ టాక్ సొంతం చేసుకుంది. వరుస‌ సినిమా ఆఫర్లను అందుకుంటు టాలీవుడ్ టాప్ బ్యూటీగా మారిన సమంత ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. అక్కినేని హీరో నాగచైతన్యను తన మొదటి సినిమా షూటింగ్లోనే ప్రేమించి.. చాలాకాలం ప్రేమాయణం తర్వాత వివాహం చేసుకుంది. అయితే వీళ్ళ వైవాహిక జీవితం మూడు నాళ్ళ‌ ముచ్చటగానే మిగిలిపోయింది.

Samantha's love for her new pet Saasha | RITZ

పెళ్లయిన కొంతకాలానికి వీరిద్దరూ మనస్పర్ధలతో విడాకులు తీసుకున్నారు. ఇక దీని తర్వాత ఎవరి కెరీర్ వారు చూసుకుంటూ బిజీ అయిపోయారు. ఇక ప్ర‌స్తుతం సమంత మ‌యోసైటిస్తో భ‌ద‌ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. దీంతో సామ్ పూర్తిగా సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన హాట్ ఫోటో షూట్ల, యాడ్ ప్రమోషన్లను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంటుంది. పర్సనల్ విషయాలను కూడా సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్‌తో పంచుకుంటున్న ఈ ముద్దుగుమ్మ కేవలం తన పోస్టులతోనే లక్షలు సంపాదిస్తుంది.

అయితే సమంతకు కుక్కలు అంటే అమితమైన ప్రేమ అన్న సంగతి అందరికీ తెలుసు. గతంలో నాగచైతన్యతో కలిసి ఉన్నప్పుడు ఆమె రెండు కుక్కలను పెంచుకుంది. వాటిని ఎంతగానో ప్రేమగా చూసుకుంది. అయితే విడాకుల తర్వాత కూడా సమంత పెంచినా కుక్కలో ఒకటి నాగచైతన్య దగ్గరే ఉండడంతో మళ్ళీ వీరిద్దరు కలుస్తున్నారని న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అయ్యింది. కాగా మరోసారి సమంత.. తన కుక్కలతో ప్రేమలో పడినట్టు ఇన్‌స్టాస్టోరీలో ఒక ఫోటో షేర్ చేసింది. దీంతో పాటే ఆ రెండు కుక్కలు సమంతకు ముద్దులు పెడుతూ వాటితో ఎంజాయ్ చేస్తున్న వీడియోను షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.