బిగ్‌బాస్‌లో గౌత‌మ్ రెమ్యున‌రేష‌న్ లీక్‌… 13 వారాల‌కు గ‌ట్టిగానే ముట్టిందిగా…!

బిగ్‌బాస్ సీజన్ 7 నిన్నటి ఎపిసోడ్లో గౌతమ్‌ కృష్ణ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. 13 వారాలు హౌస్ లో ఉన్న గౌత‌మ్ నిన్న హౌస్ నుంచి బయటకు వచ్చాడు. హౌస్ లోకి వచ్చినప్పుడు యాక్టర్ గా మాత్రమే తెలిసిన గౌతం హౌస్ నుంచి బయటకు వళ్ళేలోగా అతనొక డాక్టర్ అనే విష‌యం కూడా అందరికీ తెలియజేశాడు. ఇంకా హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత యావర్ బాడీ పై స్టెరాయిడ్స్ తీసుకున్నాడు అంటూ ప‌ర్స‌న‌ల్ కామెంట్స్ చేసిన గౌత‌మ్‌ పలు విమర్శలకు లోనయ్యాడు. తర్వాత వచ్చిన వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జునతో చివాట్లు తిన్న గౌతమ్.. యావరకు సారి కూడా చెప్పాడు.

ఇక ఆ తర్వాత హౌస్ లో మరో కంటెస్టెంట్ అయినా శుభశ్రీ తో లవ్ ట్రాక్ నడిపేందుకు చాలా ప్రయత్నించాడు. కానీ వర్కౌట్ కాలేదు. ఆమె లవ్ లో పడుతుందనే టైంకి 5వ‌ వారంలో ఎలిమినేట్ అయిపోయింది. శుభ శ్రీ తో పాటే గౌతమ్ కూడా ఎలిమినేట్ అయ్యాడంటూ బయటకు తీసుకువచ్చిన బిగ్‌బాస్ అతడిని రెండు రోజులపాటు సీక్రెట్‌ రూమ్ లో ఉంచి తిరిగి హౌస్ లోకి పంపాడు. అశ్వద్ధామ 2.0 అంటూ ఓ పవర్ ఫుల్ డైలాగ్ తో ఎంట్రీ ఇచ్చిన గౌతమ్‌.. ఇప్పటినుంచి నా ఆట ఏంటో చూపిస్తా అంటూ రెచ్చిపోయాడు.

అయితే సీరియల్ బ్యాచ్‌ తో సన్నిహితంగా ఉంటూ గ్రూప్ గేమ్ ఆడుతున్నాడనే అపవాది కూడా గౌతంపై పడింది. కాగా శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్ లకు ఎప్పుడు ఆపోజిట్ గా ఉంటూ వారిపై ఎప్పుడు నామినేషన్స్ లో యుద్ధం చేస్తూ ఉండేవాడు. ఇక ఈవారం జరిగిన ఫినాలే అస్త్ర రేసులో కూడా గౌతమ్ ఎంతో కష్టపడి పాయింట్స్ ను సొంతం చేసుకున్నాడు. అయితే చివరిగా పల్లవి ప్రశాంత్, అర్జున్, అమర్ టాప్ లో ఉండడంతో వారిలో ఎవరో ఒకరికి మీ పాయింట్స్ ఇచ్చేయాలంటూ బిగ్ బాస్ గౌతమ్‌కి ఆదేశించాడు. కాగా ప్రియాంక ఇన్ఫ్లుయ‌న్స్‌తో అమర్‌కే గౌతమ్ త‌న‌ పాయింట్స్ ఇచ్చేశాడు.

ఈ విషయంపై ఈ నాగార్జున గౌతమ్ కు క్లాస్ పీకాడు. కాగా నిన్నటి ఎలిమినేషన్స్‌లో శోభా శెట్టి, గౌతమ్‌ డేంజర్ జోన్ లో ఉండగా.. గౌతమ్ హౌస్ నుంచి బయటకు వచ్చాడు. ఈ 13 వారాల్లో గౌతమ్‌ తీసుకున్న రెమ్యున‌రేష‌న్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గౌతమ్ హౌస్ లోకి వెళ్లేందుకు వారానికి రూ.1.5 లక్షల రెమ్యూనరేషన్ ఒప్పందం చేసుకున్నాడట. ఈ విధంగా 13 వారాలకు రూ.19.5 లక్షల వరకు రెమ్యూనరేషన్ ముట్టినట్లు తెలుస్తుంది. కాగా హౌస్ లో భారీ పాపులారిటీ ద‌క్కించుకున్న గౌతమ్‌ బయటకు రావడంతో సినిమాలో కూడా బిజీ అయ్యే ఛాన్స్ ఉంది.