ఓరిని దుంప తెగ..యానిమల్ సినిమాలో అలాంటి పాత్ర కోసం కాజల్ ని చూస్ చేసుకున్నావా..? ఇలాంటి ధాట్స్ ఎలా వస్తాయ్ సందీప్..?

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే టాలీవుడ్ స్టార్ట్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న సందీప్ రెడ్డివంగా తెరకెక్కించిన యానిమల్ సినిమా గురించే చర్చలు ఎక్కువగా జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా రన్బీర్ కెరీర్ లోనే ఈ సినిమా ది బెస్ట్ మూవీ గా నిలిస్తే.. రష్మిక కెరియర్ లో బోల్డ్ పర్ఫామెన్స్ ఇచ్చిన ఏకైక సినిమాగా చరిత్ర సృష్టించింది.

ఈ సినిమాలో ప్రతి ఒక్క పాత్రను చాలా జాగ్రత్తగా డిజైన్ చేశారట సందీప్ రెడ్డి. అంతేకాదు ఎవరూ కూడా సందీప్ రెడ్డి వంగవైపు వేలు చూపించకుండా ఉండేలా ఈ సినిమాను తెరకెక్కించాడు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు . అయితే ఈ సినిమాలో కాజల్ కూడా నటించాల్సి ఉంటుంది . కానీ ఆ పాత్ర నచ్చక ఆమె రిజెక్ట్ చేసింది .

ఇంతకీ ఆ పాత్ర ఏంటి అనుకుంటున్నారా..? ఈ సినిమాలో రన్బీర్ కపూర్ కు ఒక చెల్లి ఒక అక్క ఉంటుంది. అయితే కాజల్ ని అక్క పాత్రలో చూస్ చేసుకున్నారట సందీప్ రెడ్డివంగా . అయితే హీరోయిన్స్ గా ఛాన్స్ వస్తున్న మూమెంట్లో ఇలా చేస్తే క్రేజ్ తగ్గిపోతుంది ఏమో అని రిజెక్ట్ చేసిందట . అలా ఈ సినిమాలో మంచి పాత్రను మిస్ చేసుకుంది కాజల్.