నక్క తోక తొక్కిన బేబమ్మ.. ఏకంగా రూ.100 కోట్ల సినిమాలో ఛాన్స్ కొట్టేసిందిగా..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి శెట్టి.. చిన్న వ‌య‌స్సులోనే ఉప్పెన సినిమాలో బేబ‌మ్మ‌గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది. తర్వాత వరుస సినిమా అవకాశాలను అందుకున్న ఈ బ్యూటీ నానితో శ్యామ్ సింగరాయ్‌ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది. మొదట సినిమాలో ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. నాని సినిమాలో గ్లామర్ షో తో పాటు లిప్ లాక్ సీన్లలోనూ రెచ్చిపోయింది.

( Photos : Instagram )

ఇక ఆ తర్వాత నాగార్జున, నాగచైతన్య నటించిన బంగారు రాజు సినిమాలో మెరిసింది. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత కృత్తి నటించిన సినిమాలు అన్నీ వరుసగా ఫ్లాప్స్ అవడంతో ఆమెకు మెల్లగా అవకాశాలు తగ్గాయి. యంగ్ హీరోలు అందరి సరసన నటించిన కృతి చివరిగా అక్కినేని హీరో నాగచైతన్యతో కలిసి కస్టడీ సినిమాలో కనిపించింది. ఈ సినిమా కూడా డిజాస్టర్ అయింది. తర్వాత తమిళ్‌ స్టార్ హీరో సూర్య సినిమాలో ఛాన్స్ అందుకుంది. కానీ ఈ సినిమా కూడా సట్స్‌పైకి రాలేదు. దీంతో ఆమె పై ఐరన్ లెగ్ అంటూ ముద్ర ప‌డిపోయింది.

Jayam Ravi begins the shooting for 'Genie' | Tamil Movie News - Times of  India

ఇలాంటి టైం లో కృతికి ఓ బంపర్ ఆఫర్ వచ్చిందట. తమిళ్ లో జీని అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో జయం రవి హీరోగా నటిస్తున్నాడు. కాగా కృతి శెట్టితో పాటు.. కళ్యాణి ప్రియదర్శన్, వామిక కబి కూడా ఈ సినిమాలో యాక్ట్‌ చేయబోతున్నారట. దాదాపు రూ.100 కోట్ల భారీ బడ్జెట్ తో వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఐసరి గణేష్ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ సినిమా హిట్ అయితే మాత్రం కృతి శెట్టి ఫేట్ మారిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో వేచి చూడాలి.