తప్పుడు వార్తలపై కృతి సనన్ ఫైర్.. లీగల్ నోటీసులు పంపిస్తానంటూ..

స్టార్ హీరోయిన్ కృతి స‌న‌న్‌కు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ స్టార్ బ్యూటీగా క్రేజ్‌ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ ఆది పురుష్‌ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ దక్కించుకుంది. ఇక ఇటీవల కృతి సనం తనపై సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ న్యూస్లపై ఘాటుగా స్పందించింది. తాజాగా నేషనల్ అవార్డును దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే కాఫీ విత్ కారణక్షకు హాజరు కాబోతున్నట్లు అనౌన్స్ చేసింది.

కొన్ని ట్రెండింగ్ ప్లాట్ఫామ్స్ ప్రమోట్ చేయబోతుందని వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించిన ఆర్టికల్స్ ను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసిన ఆమె.. తన గురించి తప్పుడు వార్తలు రాస్తున్న చాలా కథనాలను నేను గమనించానని.. ఆ స్టోరీస్ పూర్తిగా ఫేక్ అంటూ వివరించింది. కొందరు కావాలనే దుర్మార్గపు ఆలోచనలతో ఇలాంటి వార్తలను ప్రమోట్ చేస్తున్నారంటూ చెప్పుకొచ్చింది.

ఈ స్టోరీస్ తో తన పరువు, ప్రతిష్టకు భంగం కలుగుతుందని వివరించిన ఈ ముద్దుగుమ్మ. ఇలా త‌ప్పుడు వార్త‌లు రాసే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటానని.. వార్నింగ్ ఇచ్చింది. త్వరలోనే వారికి లీగల్ నోటీసులు జారీ చేయబోతున్నట్లు వివరించింది. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దు అంటూ అభిమానులకు వివ‌రించింది.