“షూటింగ్ లో ఎన్టీఆర్ ఎప్పుడు అలానే ఉంటాడు”..జాన్వీ కపూర్ మాటలకి నందమూరి ఫ్యాన్స్ షాక్..!!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న జాన్వి కపూర్ తెలుగులో దేవర అనే సినిమా ద్వారా డెబ్యూ ఇస్తున్న విషయం తెలిసిందే . ఈ సినిమా ద్వారా ఆమె మంచి విజయం అందుకోబోతుంది అంటూ ఫ్యాన్స్ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రెండు షెడ్యూల్ కంప్లీట్ అయ్యాయి. జాన్వి – ఎన్టీఆర్ పై చాలా ఇంపార్టెంట్ సీన్స్ ని కూడా చిత్రీకరించారు.

కాగా ఇదే క్రమంలో ఎన్టీఆర్ తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ పై జాన్వి కపూర్ మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేసింది . “తాను ఎంతో మంది హీరోలతో నటించాను అని .. కానీ ఎన్టీఆర్ లాంటి హీరోను చూడలేదు అని .. ఎప్పుడు హై ఎనర్జీతో ఉంటాడు అని .. షూటింగ్లో ఎక్కడా కూడా ఆయన ఎనర్జీ లెవెల్స్ పడిపోయినది నేను చూడలేదు అని ..నా పట్ల చాలా కేర్ తీసుకున్నారని.. నాకు పుట్టింటికి వెళ్లి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది అని ..ఎక్కడ నాకు ఇబ్బంది లేకుండా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు అని ” చెప్పుకొచ్చింది.

అంతేకాదు..”చాలా చాలా థాంక్స్ అని ఎన్టీఆర్ ను రేంజ్ లో పొగిడేసింది “. అయితే బాలీవుడ్ లో ఒక హీరోని కూడా పొగడని జాన్వి కపూర్ టాలీవుడ్ లో ఎన్టీఆర్ ని ఈ రేంజ్ లో పొగిడేయడం ఇప్పుడు అభిమన్లకు సైతం ఆశ్చర్యకరంగా ఉంది. ప్రజెంట్ ఇదే న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు నందమూరి అభిమానులు..!!