నిత్య మీనన్ హీరోయిన్ కాకపోతే ఏమై ఉండేదో తెలుసా.. అసలు గెస్ చేయలేరు..?!

సౌత్ స్టార్ హీరోయిన్ నిత్యమీనన్‌కు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. నాచురల్ స్టార్ నాని హీరోగా న‌టించిన అలా మొదలైంది సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతో మంచి సక్సెస్ను అందుకుంది. తరువాత పలు తెలుగు సినిమాలను నటించి క్రేజ్ దక్కించుకున్న ఈ బ్యూటీ దాదాపు టాలీవుడ్ యంగ్ హీరోల అందరి స‌ర‌స‌న నటించింది. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నిత్యమీనన్ టాలెంటెడ్ హీరోయిన్గా కూడా బిరుదు సంపాదించింది.

కాగా ప్రస్తుతం ప‌లు సినిమాలతో.. వెబ్ సిరీస్ లతో.. బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. నిత్యామీనన్ మాట్లాడుతూ తన సినీ కెరీర్, పర్సనల్ కెరీర్‌కు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. మీరు సినిమాల్లోకి రాకపోయి ఉంటే ఏమయ్యవారు అని ఇంటర్వ్యూ వర్‌ ప్రశ్నించగా.. దానికి ఒక షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. నేను చేసే ప్రతి రోట్‌ చాలెంజింగ్ గా ఉండాలని భావిస్తా. ప్రతిపాత్రను ఎంజాయ్ చేస్తా. అలా కుదరకపోతే సినిమాలకు దూరంగానే ఉంటా. ఒకసారి ఎటువంటి చాలెంజింగ్ రోల్స్ రాకపోవడంతో సినిమాలకు 2 ఏళ్ళు బ్రేక్ ఇచ్చా అంటూ చెప్పుకొచ్చింది.

ఓ మూవీ స్క్రిప్ట్ ఓకే చేయడం అంత ఈజీ కాదు.. ఒక ప్రాజెక్ట్ ఒప్పుకోవాలంటే వంద కారణాలు ఉంటాయి.. నేను మాత్రం సినిమా రిజల్ట్ కంటే అందులో నా పాత్రకు ఉండే ఇంపార్టెన్స్.. నేను ఏ విధంగా ఆ పాత్ర‌కు న్యాయం చేయగలను అనేదాన్నే చూసుకుంటా. ఒకవేళ నేను నటిని కాకపోయి ఉంటే జర్నలిస్ట్ అయ్యదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. నిజానికి నాకు కల కూడా జర్నలిస్ట్ కావాలనే.. కానీ కొన్ని కొన్ని సార్లు మనకు తెలియకుండానే ఇష్టాలు, అభిరుచులు అన్ని మారిపోతూ ఉంటాయి అంటూ వివరించింది నిత్య మీన‌న్. ప్రస్తుతం నిత్యామీనన్ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.