“మూతి మీద మీసం ఉన్న మగాళ్ళు ఇప్పుడు మాట్లాడండి రా”..రెచ్చిపోయిన ప్రభాస్ ఫ్యాన్స్..ఏమైందంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా సలార్. ఈ సినిమా అనౌన్స్ చేసిన మూమెంట్ నుంచి నిన్న కాక మొన్న రిలీజ్ అయిన ట్రైలర్ లాంచ్ వరకు అభిమానులు ఓ రేంజ్ లో సినిమాపై ఎక్స్పెక్ట్ చేశారు . మరీ ముఖ్యంగా బాహుబలి సినిమా తర్వాత ఒక్కటంటే ఒక్క హిట్ అందుకొని ప్రభాస్ కి ఈ సినిమా చరిత్ర తిరగరాయబోతుంది అంటూ ధీమా వ్యక్తం చేశారు.

అయితే ట్రైలర్ రిలీజ్ అయ్యాక కొంతమంది జనాలు సలార్ పై నెగిటివ్గా స్పందించిన విషయం తెలిసిందే. కొందరు మ్యాటర్ తక్కువ బిల్డప్ ఎక్కువ అంటే మరికొందరు ప్రభాస్ ఎలా ఈ సినిమాని ఒప్పుకున్నాడు అంటూ చెత్తగా కామెంట్ చేశారు. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 22న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే ట్రైలర్ లాంచ్ చేసిన మేకర్స్ కు జనాల నుంచి నెగటివ్స్ స్పందన రావడం ఇబ్బందికరంగా మారింది .

అయితే ట్రైలర్ టాక్ ఎలా ఉన్నా సరే వ్యూస్ మాత్రం దుమ్ము దులిపేసాయి . సలార్ తెలుగు ట్రైలర్ వ్యూస్ 24 గంటల్లోనే 33 మిలియన్ల వ్యూయ్స్ సాధించి సినీ ఇండస్ట్రీలో ఏ సినిమా రికార్డ్ చేయని చరిత్ర సృష్టించింది . ఇక హిందీలో ఏకంగా 54.3 మిలియన్ మార్క్ దాటేసింది . బాలీవుడ్ లో 24 గంటల్లో అత్యధిక వ్యూయ్స్ సాధించిన ట్రైలర్ గా సలార్ రికార్డ్ క్రియేట్ చేసింది. అంతకుముందు ఆదిపురుష్ 52.3 మిలియన్ల వ్యూయ్స్ తో టాప్లో ఉండింది.. ఆ రికార్డును బ్రేక్ చేసింది సలార్.

 

సలార్ ట్రైలర్ ఇలాంటి రికార్డు క్రియేట్ చేయడం పట్ల ప్రభాస్ డై హార్ట్ ఫాన్స్ బోల్డ్ గా స్పందిస్తున్నారు . ఎవరైతే సలార్ ట్రైలర్ చూసి తిట్టుకున్నారో.. నెగిటివ్గా ట్రెండ్ చేశారో.. వాళ్ళు ఇప్పుడు మాట్లాడండి అంటూ కూసింత ఘాటుగానే స్పందిస్తున్నారు. కాగా పలు భాషలలో సలార్ ట్రైలర్ ఎన్ని వ్యూయ్స్ లైక్స్ దక్కించుకునిందో ఇక్కడ చదివి తెలుసుకుందాం..!

తెలుగులో 32.6 మిలియన్ల వ్యూస్ ..12. 4 మిలియన్ లైక్స్.. హిందీలో 54.3 మిలియన్ల వ్యూస్ ..850 కె లైఖ్శ్.. తమిళంలో 9.1 మిలియన్ వ్యూస్ ..226క్ లైక్స్ ..కన్నడలో 9.6 మిలియన్లవ్యూస్ 215ఖ్ కే లైక్స్.. మలయాళం లో 7.7 మిలియన్ల వ్యూస్ ..212 ఖ్ లైక్స్ దక్కించుకుని రికార్డులు బద్ధలు కొట్టింది..!!