మూడు రోజుల పాటు రానా త‌మ్ముడు అభిరామ్ పెళ్లి అక్క‌డే… వ‌ధువు ఎవ‌రంటే…!

టాలీవుడ్ నిర్మాత సురేష్ తనయుడు.. అలాగే రానా తమ్ముడు.. దగ్గుబాటి అభిరామ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇటీవల ఈయన అహింస సినిమాతో ప్రేక్షకుల ముందుకి సంగతి తెలిసిందే. అలాగే అభిరామ్, శ్రీ రెడ్డి ఎఫైర్ గురించి ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది.

అలాగే శ్రీరెడ్డి కూడా ఈయనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రేక్షకులంతా షాక్ అయ్యారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా అభిరామ్.. శ్రీలంకలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నట్లు సమాచారం. మొత్తం ఈ వేడుకని మూడు రోజులపాటు జరుపుకోనున్నారట.

డిసెంబర్ 4న డిన్నర్ పార్టీ, 5న మెహందీ, విందు ఏర్పాటు చేశారట. 6న ప్రత్యూష చపరాల మెడలో అభిరామ్ మూడు ముళ్ళు వేయనున్నాడు. అయితే ఈ వేడుకకు 200 మంది సన్నిహితుల మధ్య కుటుంబ సభ్యుల సమక్షంలో వీరీ పెళ్లి జరగనున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.