రష్మిక-రణబీర్ ముద్దులు పెట్టుకుంటే అనసూయ మాట్లాడదా..? మళ్ళీ కెలికిన ట్రోలర్స్..!!

సోషల్ మీడియాలో పని పాట లేని జనాలు అందరూ కుదిరితే మెగా ఫ్యామిలీ లేదంటే అనసూయ ఈ రెండిటి టాపిక్స్ పైనే ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు అంటూ అనసూయ ఫాన్స్ మండిపడుతున్నారు . అసలు ఆమె పేరు ప్రస్తావన రాకుండానే అక్కడ ఆమె పేరుని తీసుకువచ్చి వల్గర్ గా ట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ మండిపడుతున్నారు. రీసెంట్గా యానిమల్ సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే .

అయితే ఈ సినిమాలో రష్మిక పర్ఫామెన్స్ టు బోల్డ్ గా ఉంది . అంతేకాదు రన్బీర్ కపూర్ పెర్ఫార్మెన్స్ అయితే బోల్డ్ కా బాప్ అనే రేంజ్ లో ఉంది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో రష్మికను చాలామంది బూతులు తిడుతూ ట్రోల్ చేస్తున్నారు . అయితే రీసెంట్గా అనసూయ పేరును అందులోకి లాగుతూ కొందరు జనాలు ఆమెను చీప్ గా కామెంట్ చేస్తున్నారు . విజయ్ దేవరకొండ అలా నటిస్తే ఓ రేంజ్ లో నోరు పారేసుకుంటావ్.. మరి రన్బీర్ కపూర్ నటిస్తే ఏంటి ఏం మాట్లాడడం లేదు..?

ఇప్పుడు సమాజం ..ఆడపిల్ల ..పద్ధతులు గుర్తు రావడం లేదా..? అంటూ కౌంటర్స్ వేస్తున్నారు. మరికొందరు విజయ్ దేవరకొండ అలాంటి సీన్స్ లో నటిస్తేనే అనసూయ కి ప్రాబ్లమ్ వస్తుందా..? అని మిగతా హీరోలు ఎవరు నటించిన ఆమెకు అసలు అవసరం లేదు ..? అని ఘాటుగా స్పందిస్తున్నారు . అనసూయ ఫ్యాన్స్ కూడా అదే రేంజ్ లో మండిపోతున్నారు . అనవసరమైన టాపిక్ లో అనసూయ పేరు తీసుకొచ్చి ఆమె పరువు తీయకండి అంటూ ఘాటుగా రిప్లై ఇస్తున్నారు . దీంతో అనసూయ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!