” అస్సలు అందులో తప్పు ఏం ఉంది..?”.. విజయ్-రష్మిక ఫోటో పై నాని హాట్ కామెంట్స్..!!

ఈ మధ్యకాలంలో సినీ ప్రమోషన్స్ కోసం కొందరు స్టార్ సెలబ్రిటీస్ ఎలా తాపత్రయ పడిపోతున్నారో మనం చూస్తున్నాం . మరీ ముఖ్యంగా కొంతమంది స్టార్స్ సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలి అంటూ నానా విధాలుగా ప్రయత్నిస్తున్నారు . రీసెంట్గా హాయ్ నాన్న ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో రష్మిక మందన్నా- విజయ్ దేవరకొండ పర్సనల్ ఫోటో టెలికాస్ట్ అయిన విషయం తెలిసిందే.

ఇది చాలా తప్పు అంటూ చాలామంది ఫాన్స్ మండిపడ్డారు . అసలు సినిమాకి సంబంధం లేని వాళ్ళ పర్సనల్ ఫోటో టెలికాస్ట్ చేయడం చాలా చాలా నేరమంటూ కూడా చెప్పుకొచ్చారు . దీనిపై రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో నాని స్పందించాడు. ” దయచేసి ఈ టాపిక్ ని ఇక్కడితో వదిలేయండి అని ..రష్మిక విజయ్ నాకు మంచి ఫ్రెండ్స్ అని .. పొరపాటున ఇది జరిగిందే తప్పిస్తే ఎవ్వరూ కావాలని ఆ ఫోటోని టెలికాస్ట్ చేయలేదు అని”..

” టెక్నికల్ టీం తప్పిదం వల్ల ఇలా జరిగింది అని ..నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటాం”అని చెప్పుకొచ్చారు . దీంతో నాని కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే విజయ్ ఫ్యాన్స్ మాత్రం దీని పై సీరియస్ అవుతున్నారు. నీ ఫోటో అలా వేస్తే ఒప్పుకుంటావా..? అంటూ ప్ర్శ్నిస్తున్నారు. మరి కొందరు అస్సలు తప్పు ఏం ఉంది..? అంటూ కామెంట్ చేస్తున్నారు..!!