” డెవిల్ ” సినిమాకి రికార్డ్ బిజినెస్… అన్ని కోట్లు వస్తేనే నందమూరి హీరోకి హిట్.. లేదంటే మళ్లీ మొదటికి వచ్చినట్టే…!

నందమూరి హీరోలలో ఒకడైన కళ్యాణ్ రామ్ మనందరికీ సుపరిచితమే. ఈయన తాజాగా నటించిన మూవీ ” డెవిల్ “. భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ నేడు రిలీజ్ అయింది. ఇక ఈ నేపథ్యంలోనే కళ్యాణ్ రామ్ మూవీకి థియేటర్ బిజినెస్ ఎంత జరిగితే నందమూరి హీరోకి హిట్ పడుతుంది అనే వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అభిషేక్ నామ తెరకెక్కించిన ఈ మూవీని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై దేవాంన్ష్ నామ నిర్మించారు. ఇక ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం డెవిల్ మూవీకి తెలుగు రాష్ట్రాలలో ఊహించని విధంగా రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగింది.

ట్రెండ్ లెక్కల ప్రకారం.. నైజాంలో రూ.5.50 కోట్లు, సిడెడ్‌లో రూ.3.00 కోట్లు, ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాలలో కలిపి రూ.8.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా అన్ని ఏరియాలలో కలిపి రూ.20.10 కోట్లు బిజినెస్ను జరుపుకుంది. ఇక దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ‌‌.21 కోట్లుగా నమోదయింది. ఇక వసూళ్లు పరంగా ఇదే విధంగా దూసుకుపోతే కళ్యాణ్ రామ్ పక్కా సూపర్ హిట్ అందుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.