రష్మిక తో ఏకంగా 20 సార్లు చెంప దెబ్బలు తిన్న ఆ స్టార్ హీరో… సిగ్గు లేదా అంటూ కామెంట్స్…!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ పరిశ్రమలలో కూడా ఫుల్ బిజీగా ఉంటూ దూసుకుపోతుంది. ఇటీవలే ” యానిమల్ ” అనే సినిమాతో ప్రేక్షకులం ముందుకి వచ్చి సూపర్ హిట్ విజయాన్ని దక్కించుకుంది.

టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 1న విడుదలై బాక్సాఫీస్ షేక్ చేసిందనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే రష్మిక తో 20 సార్లు ఓ హీరో చంప దెబ్బలు తిన్నాడంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యానిమల్ నిర్మాత, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ సోదరుడు అయిన ప్రణయ్ రెడ్డి వంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఈ క్రమంలోనే హీరో రణబీర్ కపూర్, రష్మిక చేతిలో 20 సార్లు చంపదెబ్బలు తిన్నారంటూ చెప్పుకొచ్చాడు. యానిమల్ మూవీలో కర్వా చౌత్ సీన్ చేసే సమయంలో హీరోను రష్మిక కొడుతుంది. అయితే ఆ సన్నివేశం పర్ఫెక్ట్ గా రావడానికి దాదాపు 20 టేకులు తీసుకున్నారట మేకర్స్. ఈ క్రమంలోనే రష్మిక.. రణబీర్ ను 20 సార్లు చెంపదెబ్బ కొట్టిందట. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.