ఇది కదా అదృష్టం అంటే.. బాలయ్య సినిమాలో హీరోయిన్ రాశి.. పాత్ర ఏంటో తెలుసా.?

ఇది నిజంగా హీరోయిన్ రాశికి జాక్ పాట్ ఆఫర్ అని చెప్పాలి. హీరోయిన్ రాశి సినిమా ఇండస్ట్రీలో ఆమె పేరుకి ప్రత్యేక స్థానం ఉంది . ఇప్పుడంటే ఆమె సీనియర్ పాత్రలు చేస్తుంది కానీ ఒకప్పుడు హీరోయిన్గా నటించే సమయంలో ఆమె కుర్రాళ్ల గుండెల్లో గిలిగింతలు పెట్టేది. చీర కట్టుకొని తల్లో పూలు పెట్టుకొని ఆమె స్టెప్స్ వేసింది అంటే కుర్రాళ్ళ గుండెలు జారిపోవాల్సిందే.

అలాంటి ఓ పర్ఫామెన్స్ ఇచ్చిన స్టార్ బ్యూటీ సెకండ్ ఇన్నింగ్స్ లో ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తున్న రాశి ఎక్కువగా కంటెంట్ ఉన్న పాత్రలనే చూస్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది . ఈ క్రమంలోనే బాలయ్య – బాబీ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేయడానికి యాక్సెప్ట్ చేసినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

నిజానికి హీరోయిన్ రాశి బాలయ్య సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది . ఆ తర్వాత ఆయనతో కృష్ణ బాబు సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుని జోడిగా నటించింది . ఇప్పుడు ఆయనకు విలన్ పాత్రలో కనిపించబోతుంది . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది. చూద్దాం మరి ఈ విలనిజం ఆమెకు ఎలా కలిసి వస్తుందో..??