మీరు కొనే చాపలు తాజావో, కాదో ఈ సింపుల్ టిప్స్ తో కనిపెట్టండి.. లేదంటే నష్టపోతారు..!

సాధారణంగా ప్రతి ఒక్కరూ చేపలని తింటూ ఉంటారు. ఇక ఇది మన ఆరోగ్యానికి చాలా మంచివి కూడా. వారంలో కనీసం రెండుసార్లు చేపలు తినడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. అయితే కొందరికి తాజా చాపలు కొనడం తెలియదు. వారి కోసమే ఈ టిప్స్. చేపలు తాజాగా ఉంటేనే వంటలు రుచిగా ఉంటాయి. కాబట్టి చాపలు కొనేటప్పుడు ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి.

చాపలు నుంచి పుల్లటి నీచు కంపు వస్తే కొనవద్దు. బాగా పాడైన చాపలే అలా స్మెల్ వస్తాయి. చాపల ముక్కలను తెరిచి చూస్తే ముదురు పింక్ కలర్ లో ఉండాలి. కోస్తున్నప్పుడు రక్తం కూడా అదే రంగులో ఉండాలి. అలాగే చాపల కళ్ళు మూసుకుని, తెల్లని పోరా లాగా కనిపిస్తే అసలు కొనవద్దు. అవి తాజా చాపలు కాదు. అవి కళ్ళు తెరిచి ఉంటేనే అవి తాజా చాపలు.

అలాగే ఆ చేప పై నొక్కితే దాని శరీరం లోపలికి వెళితే అది మంచి చేప కాదు. చాపలు కొనేటప్పుడు ముక్క సర్సుమని తెగాలి. మెత్తగా తెగుతుంటే అది నిలవైనా చేప అని అర్థం. ఇలా మార్కెట్ కి వెళ్లినప్పుడు ఈ సింపుల్ చిట్కాలను ఫాలో అయ్యి మంచి చేపను తెచ్చుకోండి. తద్వారా మీ ఆరోగ్యం కూడా సురక్షితంగా ఉంటుంది. లేకపోతే మీకు అనారోగ్యం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.