మహేశ్ బాబు బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..? ఏ ప్రాబ్లమ్ వచ్చిన మొదట కాల్ వెళ్లేది అక్కడికేనా..?

సాధారణంగా మనిషి అన్న తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా లైఫ్లో ఒక ఫ్రెండ్ ..ఒక బెస్ట్ ఫ్రెండ్ అని ఉంటారు. కొంతమందికి ఇంకా ఎక్కువగా ఉంటారు . ఫ్యామిలీ మెంబర్స్ అమ్మానాన్నలతో షేర్ చేసుకోలేని విషయాలు కూడా ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటారు . కొందరికి ఫ్రెండ్స్ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ గా మారిపోతూ ఉంటారు.

కాగా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలకు కూడా ఫ్రెండ్స్ కీలకంగా మారారు . కాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అనేది ఇప్పుడు వైరల్ గా మారింది . గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ బాబుకు ఇదే ప్రశ్న ఎదురైంది . అప్పుడు మహేష్ బాబు సెకండ్ కూడా ఆలోచించుకోకుండా ఇచ్చిన ఆన్సర్ వైరల్ అవుతుంది.

“నా బెస్ట్ ఫ్రెండ్ నమ్రత శిరోద్కర్ అని.. ఇప్పటికీ ఎప్పటికీ నా లైఫ్ లో ఆమె నా బెస్ట్ ఫ్రెండ్ అని .. నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే ఆమెకే కాల్ చేస్తానని.. నాకు మంచి మంచి సజెషన్స్ ఇస్తుంది అని.. ఒక వైఫ్ గా కన్నా ఒక ఫ్రెండ్ గానే నేను నమ్ముతాను ఇష్టపడతాను అని చెప్పుకొచ్చాడు “. ప్రెసెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. వైఫ్ కి మించిన బెస్ట్ ఫ్రెండ్ మరి ఎవరు ఉంటారు అంటూ మహేశ్ బాబు ఆన్సర్ ని పొగిడేస్తున్నారు జనాలు..!!