రోజు రోజుకి తగ్గిపోతున్న అనుష్క క్రేజ్.. డేంజర్ జోన్ లో స్వీటీ కెరీర్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ఒకప్పుడు వరుస సినిమాలతో.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. సూపర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ సినిమా సక్సెస్ కాకపోయినా నట‌న‌కు మంచి మార్కులు కొట్టేసింది. ఇక రవితేజ విక్రమార్కుడు సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ.. వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ టాలీవుడ్ అగ్ర హీరోల అందరి స‌ర‌స‌న‌ నటించింది. దాదాపు పదిహేను, పదహారేళ్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోయిన ఈ అమ్మడు.. సైజ్ జీరో సినిమా తరువాత కాస్త నెమ్మదించింది.

Anushka Shetty Height, Weight, Age, Affairs, Husband, Biography & More

ఈ సినిమా తర్వాత ప్రభాస్‌తో పాన్ ఇండియన్ మూవీ బాహుబలి సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా హోల్డ్ లో పెడుతూ వచ్చింది. అరుంధతి, భాగమతి లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కూడా టాలీవుడ్ మార్క్ బ్యూటీగా క్రేజ్‌ను సంపాదించుకున్న అనుష్క క్రేజ్ మొత్తం ప్రస్తుతం మైనంలా కరిగిపోతుందంటూ.. నెటిజ‌న్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకు ఉన్న క్రేజ్.. ఇప్పుడు అనుష్కకు లేదంటూ నిరాశ చెందుతున్నారు. అయితే బాహుబలి సినిమా సక్సెస్ అందినప్పటికీ ఈమె సినిమా అవకాశాలను హోల్డ్ పెట్టడానికి బరువు పెరిగిపోవడమే కారణమంటూ పలు వార్తలు కూడా వినిపించాయి.

ఏదేమైనా ఇటీవల నవీన్ పోలీస్ శెట్టితో కలిసి అనుష్క నటించిన మిస్సటి మిస్టర్ పోలిశెట్టి మంచి సక్సెస్‌ అందుకుంది. అయితే ఈమె సినిమా అవకాశాలను హోల్డ్‌లో పెట్టుకుంటూ రావడంతో అనుష్కకు కాస్త క్రేజ్ తగ్గింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక‌ అనుష్క కంటే ముందు వెనక ఇండస్ట్రీలోకి వచ్చిన వారంతా ఇప్పటికి స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్నారు. ఇక త్రిష, నయనతార, కాజల్ అగర్వాల్, తమన్న, పూజ హెగ్డే లాంటి స్టార్ హీరోయిన్స్ అంతా ఎప్పుడో ఒకప్పుడు సినిమా అవకాశాలకు దూరమయ్యారు.

Anushka Shetty's Latest Look Shocks All

కానీ తమ ఐడెంటిటి మాత్రం ఎప్పుడూ మిస్ చేసుకోకుండా అభిమానులకు ఏదో ఒక రూపంలో దగ్గరగానే ఉన్నారు. ఇక వీరిలో కాజల్, తమన్న అయితే ఇన్‌స్టా ఆక్టివిటీస్ తో చాలా కాలం పాటు తమ క్రేజ్ ని అలాగే కొనసాగించారు. ఇది వారి సెకండ్ ఇన్నింగ్స్ లోను బాగా తోడ్పడింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ అవకాశాల్ని అందుకుంటూ మళ్లీ బిజీ అవుతున్నారు. అయితే ఈ విషయంలో అనుష్క మాత్రం చాలా వెనుకబడింది. ఇన్‌స్టా, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా వేదికలు వేటిలో అనుష్క కనిపించడం లేదు. దీంతో ఐడెంటిటీ కూడా మిస్ అవుతుంది. తనకు సంబంధించిన ఏ అప్డేట్ కూడా రాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.