రవితేజ – హరీష్ శంకర్ సినిమా టైటిల్ ఏంటో తెలుసా? అదే సెంటిమెంట్ రిపీట్..ఈ సారి బ్లాక్ బస్టర్ హిట్ కన్ఫర్మ్..!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోలు భలే సెట్ అవుతూ ఉంటాయి. వన్స్ అవి సెట్ అయి హిట్ కొట్టాక మళ్ళీ అలాంటి క్రేజీ కాంబోలో వస్తే బాగుంటుంది అంటూ ఆశపడుతూ ఉంటారు . అలాంటి ఓ క్రేజీ కాంబోనే హరీష్ శంకర్ మాస్ మహారాజ రవితేజ . ఇద్దరికి ఇద్దరే మంచి ఘాటైన మిర్చి లా ఉంటారు . కాగ గతంలో వీళ్ళ కాంబోలో షాక్ – మిరపకాయ సినిమాలు వచ్చాయి.

షాక్ యావరేజ్ గా నిలిచిన మిరపకాయ మాత్రం బాక్సాఫీస్ రికార్డును బద్దలు కొట్టేసింది . వీళ్ళ కాంబోలో ముచ్చటగా మూడో సినిమా రాబోతుంది అని తెలియగానే ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటూ వచ్చారు . రవితేజ కాంబోలో వస్తున్న న్యూ ప్రాజెక్ట్ కు “మిస్టర్ బచ్చన్: టైటిల్ను ఫిక్స్ చేశారు . అంతేకాదు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు . ఈ లుక్ లో రవితేజ యమ నాటీగా క్యాచీగా ..

కొంచెం క్లాస్ కొంచెం మాస్ గా అదరగొట్టేసారు. దీంతో సోషల్ మీడియాలో “మిస్టర్ బచ్చన్” సినిమాకి సంబంధించిన ఫొటోస్ లుక్స్ వైరల్ గా మారాయి. అంతేకాదు ఇవి చూస్తుంటే గతంలో మిరపకాయ సినిమా గుర్తొస్తుందని అదే కన్ఫామ్ ఐతే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అంటున్నారు జనాలు..!