“సలార్ హిట్ అయిన నో ప్రాబ్లం..మా సినిమాలో అది ఉంది”..బబుల్గం డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాకి సంబంధించిన టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. బాహుబలి తర్వాత అస్సలు హిట్ కొట్టని ప్రభాస్ కి.. ఈ సినిమా మంచి క్రేజ్ ని తీసుకొచ్చి పెట్టింది. అంతేకాదు మొదటి రోజే ఏకంగా 177 కోట్లు కలెక్ట్ చేసి సంచలన రికార్డును క్రియేట్ చేసింది . అయితే ఇంత పెద్ద సినిమా రిలీజ్ అయిన ఏడు అంటే ఏడు రోజుల తర్వాత చిన్న హీరో అదికూడా డెబ్యూ ఇస్తున్న హీరో సినిమా రిలీజ్ కి సిద్ధం కావడం గమనార్హం.

ఆయన మరెవరో కాదు రోషన్ . సుమా రాజీవ్ కనకాల కొడుకు రోషన్ బబుల్గం సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇస్తున్నాడు . ఈ క్రమంలోనే బబుల్గం డైరెక్టర్ సలార్ సినిమాపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” ఆయన ప్రభాస్ గారి సలార్ సినిమా పెద్ద హిట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది ..మేము కూడా ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాం “.

“అయితే సలార్ హిట్ అయినంత మాత్రాన మా సినిమా ఫ్లాప్ అవుతుంది అని చెప్పడానికి లేదు .. ఎందుకంటే సలార్ సినిమాల్లో లేని కంటెంట్ మా సినిమాలో ఉంది . ఏ సినిమాలో కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారు అన్న నమ్మకం నాకుంది “అంటూ చెప్పుకొచ్చాడు . దీంతో ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చూద్దాం 29 న సినిమా ఎలాంటి రిజల్ట్ దక్కించుకుంటుందో..?