ఆస్తులు అముకున్న జాన్వి, ఖుషి.. బోనీ కపూర్ కూడా అడ్డు చెప్పకపోవడానికి కారణం అదేనా..?

దివంగత స్టార్ హీరోయిన్ శ్రీదేవికి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా స్టార్ హీరోయిన్‌గా క్రేజ్‌ను సంపాదించుకున్న శ్రీదేవి కూతురు జాన్వి కపూర్, ఖుషి కపూర్ కి కూడా ఎటువంటి క్రేజ్ ఉందో తెలిసిందే. ఇక ఇప్పటికే జాన్వి కపూర్ బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి పాపులారిటీ దక్కించుకుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోయిన్గా దేవర సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది జాన్వీ కపూర్. ఖుషి కపూర్ కూడా బాలీవుడ్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది.

Boney Kapoor has reacted to reports that his daughter Khushi Kapoor will  make her acting debut with Zoya Akhtar's Netflix adaptation of the Archie  comics | खुशी कपूर के डेब्यू पर सस्पेंस:

అయితే తాజాగా ఈ అక్క, చెల్లెళ్‌ళు ఇద్దరు తమ పేరు మీద ఉన్న కొన్ని ఆస్తులను అమ్మిన‌ట్లు సమాచారం. ముంబైలో ప్రతిష్టాత్మక అందేరి శివారులోని నాలుగు ఫ్లాట్లను ఇప్పటికే ఈ సిస్ట‌ర్స్‌ అమ్మేశారట. అయితే నగరానికి మోస్ట్ అప్ స్కేల్ ఏరియా అయినా హైఎండ్ లోకండ్‌వాలా కాంప్లెక్స్ లో ఉన్న ఆ ఆస్తుల‌ను కేవలం రూ.12 కోట్లకే ఈ కపూర్ సిస్టర్ అమ్మేసినట్లు తెలుస్తుంది.

Janhvi Kapoor Sebut Khushi Kapoor Lebih Bijaksana

ఈ ఏడాది నవంబర్ 2న బోనీకపూర్, అతని కుమార్తెలు మొదటి అంతస్తులో ఉన్న రెండు ఫ్లాట్స్ ను రూ.6.2 కోట్ల‌కు విక్ర‌యించ‌గా.. అంతకుముందు అంటే అక్టోబర్ 12న మరో రెండు ఫ్లాట్స్ ని రూ.6 కోట్లకే అమ్మేశారట. 14 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఆ ఫ్లాట్‌లో రెండు పార్కింగ్ స్థలాలు ఉన్నాయట‌. ఇక 2022లో బాంద్రాలో రూ.65 కోట్లతో ఓ డూప్లెక్స్ అపార్ట్మెంట్‌ కొనుక్కున్న వీరు అక్కడే ఉంటున్నారు. దీంతో ఈ ఫ్లాట్స్ అవసరం లేదని ఉద్దేశంతోనే ఆస్తులను అమ్మేశారట. ఆ కారణంగానే బోనీ కపూర్ కూడా వారు ఆస్తులు అమ్మడానికి అడ్డు చెప్పలేదని తెలుస్తోంది.