నా రికార్డు బద్దలు కొట్టాలంటే అవతల కూడా నేనే ఉండాలి.. రెబల్ స్టార్ రేర్ రికార్డ్..

ప్రభాస్ హీరోగా నటించిన సలార్ మూవీ.. ప్రస్తుతం వన్ ఇండియా లెవెల్ లో బాక్సాఫీస్ ను షేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో పృథ్విరాజ్ సుకుమారన్‌, శృతిహాసన్ కీలక పాత్రలు నటించిన ఈ సినిమాకు ఇప్పటికే ఎంతోమంది సినీ ప్రముఖుల ప్రశంసలు అందాయి. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే తమ హీరోని ఇలాంటి మాస్ యాంగిల్ లో చాలా కాలం తర్వాత చూసాం.. ఎట్టకేలకు మా హీరో ఖాతాలో బ్లాక్ బస్టర్ పడింది అంటూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటున్నారు.

ఇక సలార్ మొదటి రోజే రూ.177 కోట్లకు పైగా గ్రాస్ వ‌సుళ్ళు కొల్లగొట్టి రేర్ రికార్డును సాధించింది. 2023 లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చిన ఇండియన్ సినిమాగా రికార్డ్ సృష్టించింది. అయితే ఇదే మూవీతో ప్రభాస్ మరో రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది ఫస్ట్ డే కలెక్షన్లు ఏకంగా రెండు సినిమాలకు రూ.100 కోట్లు దక్కించుకున‌ ఏకైక హీరోగా ప్రభాస్ రికార్డ్ సృష్టించాడు.

Ahead of Adipurush release, film's VFX supervisor reveals how team swung  into action after criticism - India Today

ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్‌ మూవీ కూడా ఈ ఏడాదిలో విడుదలై మొదటి రోజు రూ.140 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంది. మళ్ళీ ఇప్పుడు సలార్ కూడా రూ.177 కోట్లు రాబట్టింది. ఇలా ఒకే ఏడాదిలో వచ్చిన రెండు సినిమాలు ఓపెనింగ్స్ తోనే రూ.100 కోట్లు కలెక్షన్స్ సాధించడం కేవలం ప్రభాస్ కే సొంతమైంది. ఇలా ప్రభాస్ తన రికార్డును తానే మళ్లీ బ్రేక్ చేశాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది.