సలార్ సినిమా హిట్ అయ్యాక ప్రభాస్ కి మొదట కాల్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసా..? మోస్ట్ స్పెషల్ పర్సన్..

సలార్ ఇది ఒక సినిమా పేరు కాదు ఒక చరిత్ర ..ఒక ప్రభంజనం.. ఒక వైరస్ లా పట్టి పాకేసింది . ఇప్పుడు ఎవ్వరి నోట విన్న సలార్ అంటూ మారుమ్రోగిపోయేలా చెవులు తూట్లు పడేలా అరుస్తున్నారు . అఫ్కోర్స్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇది వినడానికి బాగానే ఉన్నా మిగతా జనాలకు మాత్రం ఏంట్రా ఈ సలార్ గోల అంటూ చర్చించుకుంటున్నారు . సలార్ సినిమా ఒక్కసారి చూస్తే ఆ పిచ్చి ఖచ్చితంగా ఎక్కేస్తుంది .

ప్రతి ఒక్కరూ జై సలార్ అనాల్సిందే. అలాంటి ఓ అద్భుతమైన పర్ఫామెన్స్ మనకి చూపించాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ ని ఆయన అభిమానులు ఎలా చూడాలి అనుకున్నారో అదే విధంగా హ్యాపీగా చేసి అదే విధంగా తెరకెక్కించి చూపించాడు . అయితే ప్రభాస్ సలార్ సినిమా హిట్ అయ్యాక చాలామంది ట్విట్టర్ వేదికగా ఇంస్టాగ్రామ్ లో ఆయనను పొగిడేస్తూ మెసేజ్లు .. మూవీకి రివ్యూలు ఇస్తున్నారు .

కానీ ప్రభాస్ సలార్ సినిమా చూసిన తర్వాత ఒక వ్యక్తి మాత్రం ఆయనకు ఫోన్ చేసి ఫస్ట్ కంగ్రాట్స్ చెప్పి చాలా ఎమోషనల్ గా స్పందించారట . ఆయన మరెవరో కాదు గోపీచంద్ . ప్రభాస్ జాన్ జిగిడి దోస్త్. వీళ్లిద్దరూ మంచి బెస్ట్ ఫ్రెండ్స్ . వీళ్లిద్దరి కాంబోలో వర్షం సినిమా కూడా వచ్చింది . వీళ్లిద్దరి కాంబోలో మరో సినిమా కోసం వేచి చూస్తున్నారు జనాలు . సలార్ సినిమాలో ముందుగా పృథ్వీరాజ్ పాత్ర కోసం గోపీచంద్ ని అనుకున్నారు కానీ , ప్రభాస్ సహాయం చేస్తున్నాడు అని అంతా అనుకుంటారని ..రిజెక్ట్ చేశారట గోపీచంద్ . ఈ సినిమా చాలా బాగుంది అని సినిమా చూసిన తర్వాత ఫస్ట్ ప్రభాస్ కి విష్ చేసిన హీరో గోపీచంద్ కావడం గమనార్హం..!!