ముఖ్యమంత్రిని కలిసిన చరణ్ – ఉపాసన.. ఎందుకంటే…!

మెగా ప్రిన్స్ క్లీంకారకు 6 నెలలు నిండడంతో మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు మెగా ఫ్యామిలీ. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే కార్యాలయాన్ని సంప్రదించారు. చరణ్ దంపతులు సీఎంను కలిసి పూల బోకే అందించి… శుభాకాంక్షలు తెలిపారు.

తరువాత కాసేపు సీఎంతో మాట్లాడారు. ఇక తమను రిసీవ్ చేసుకునే పద్ధతి నచ్చిందంటూ.. మహారాష్ట్ర సీఎం, ఆయన కొడుకు శ్రీకాంత్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ. సీఎంతో కలిసి దిగిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అలాగే ముంబై అభిమానులు తమపై కురిపించిన ప్రేమ, ఆప్యాయత, అభిమానానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇక ప్రస్తుతం చరణ్, ఉపాసన సీఎంతో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ ఫోటోను చూసిన మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.