” సలార్ ” ఎఫెక్ట్ తో అడ్రస్ లేకుండా పోయిన ” డంకీ “… కలెక్షన్స్ లో మరీ ఇంత తేడానా…!

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఈ ఏడాది పఠన్, జవాన్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నాడు. రెండు సినిమాలు భారీ కలెక్షన్స్ రావడంతో…” డంకీ ” సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకి వచ్చింది ఈ మూవీ. అయితే మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకోగా.. ఆశించిన స్థాయిలో బుకింగ్స్ రాబట్ట లేకపోయింది.

ఇక రెండో రోజు ఈ మూవీ కలెక్షన్స్ డల్ అయిపోయాయి. ఇదిలా ఉంటే డిసెంబర్ 22న పాన్ ఇండియా హీరో ప్రభాస్ ” సలార్ ” మూవీ విడుదలై సూపర్ హిట్ టాక్ ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇదే టైంలో సలార్ మూవీ కూడా థియేటర్లలోకి రావడంతో డంకీ బోల్తా పడిపోయింది.

ఇక దీంతో ఇండియాలో రెండు రోజుల్లో రూ.49.20 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించగలిగింది. ఇక ప్రపంచవ్యాప్తంగా డంకీ సినిమాకి తొలి రోజు రూ.58 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాగా… రెండో రోజు రూ.45 కోట్ల వరకు వచ్చినట్లు సమాచారం. ఇక సలార్ తో పోల్చుకుంటే ఈ మూవీ కలెక్షన్స్ తక్కువనే చెప్పాలి. ఇక రానున్న రోజుల్లో సలార్ ని తలదన్ని ఈ మూవీ ముందుకీ వెళ్తుందో లేదో చూడాలి మరి.