వావ్: అల్లు అర్జున్ సినిమాలో త్రిష.. ఏ సినిమాలో అంటే.. ?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో బిజీ బిజీగా ఉన్నాడు . అయితే ఈ సినిమా అయిపోయిన వెంటనే అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావుతో ఓ సినిమాలో నటిస్తున్నాడు .

ఈ సినిమాలో శ్రీ లీల – సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది . కాగా తాజాగా ఈ సినిమాలో త్రిష కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . దీంతో త్రిష అల్లు అర్జున్ ల పేర్లు మారుమ్రోగిపోతున్నాయి .

కాగా రీసెంట్ గానే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన త్రిష తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది . ఇప్పుడు ఏకంగా అల్లు అర్జున్ సినిమాలో ఛాన్స్ కొట్టేసి పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ దక్కించుకుంటుంది. చూద్దాం ఈ సినిమాతో ఎలాంటి హిట్ తన ఖాతాలో వేసుకోబోతుందో ఈ చెన్నై బ్యూటీ..!!