ఎట్టకేలకు వివాహం చేసుకున్న నాగచైతన్య ఫస్ట్ మూవీ హీరోయిన్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మొదట నాగచైతన్య నటించిన జోష్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కార్తిక నాయర్.. ఈ అమ్మడు సీనియర్ హీరోయిన్ రాధ కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఎక్కువ కాలం రాణించలేకపోయింది. ప్రస్తుతం దుబాయ్ లో తన కుటుంబానికి ఉన్న హోటల్ బిజినెస్లను సైతం చూసుకుంటూ బిజినెస్ ఉమెన్ గా మారిపోయినట్లు సమాచారం.అయితే ఇటీవలే ఎంగేజ్మెంట్ కూడా చేసుకోవడం జరిగింది.అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసి అందరికి షాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

ఇప్పుడు తాజాగా వివాహ బంధంతో ఒక్కటైనట్లుగా తెలుస్తోంది.రోహిత్ మీనన్ అనే అబ్బాయిని ఈ రోజున అంగరంగ వైభవంగా కేరళలో వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వివాహానికి సైతం చాలామంది సెలబ్రిటీలు కూడా హాజరయ్యి ఈ కొత్త జంటని ఆశీర్వదించినట్లు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ముఖ్యంగా చిరంజీవి, సుహాసిని, రేవతి ,రాధిక తదితరులు సైతం ఈ పెళ్లి వేడుకలలో కనిపించారు. చాలా గ్యాప్ తర్వాత అలనాటి తారలు ఈ పెళ్లి వేడుకలు కనిపించడంతో పాటు తెగ సందడి చేస్తున్నారు.

జోష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కార్తీక ఆ తర్వాత రంగం సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. మళ్లీ అలాంటి విజయాన్ని మాత్రం తన కెరియర్ లో అందుకోలేదు. ఎన్టీఆర్ నటించిన దమ్ము సినిమాలో నటించిన ఫ్లాప్ గా మిగిలిపోయింది. తన కెరీర్లో 9 సినిమాలలో నటించిన కార్తీక నాయర్ 2015లో చివరిగా ఒక తమిళ సినిమాలో మాత్రమే నటించింది. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది ప్రస్తుతం దుబాయిలో బిజినెస్ మైంటైన్ చేస్తున్నట్లు సమాచారం.