నట విశ్వరూపంతో దుమ్ములేపేస్తున్న శ్రీకాంత్ కోటబొమ్మాళి టీజర్..!!

టాలీవుడ్ హీరో నటుడు శ్రీకాంత్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. మొదట ఇండస్ట్రీలోకి విలన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఫిదా చేయడం జరిగింది.ఎన్నో మంచి మంచి చిత్రాలలో నటించిన శ్రీకాంత్ ఈ మధ్యకాలంలో పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించడం జరిగింది. ఈ మధ్యనే స్కంద సినిమాలో కూడా ఒక విభిన్నమైన రోల్ లో నటించి మెప్పించారు. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత హీరోగా మారి నటిస్తున్న చిత్రం కోటబొమ్మాళి .

ఈ చిత్రానికి తేజ మారని దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. మలయాళం లో భారీ హిట్ అందుకున్న నాయట్టూ అనే చిత్రానికి ఈ సినిమా రీమేక్ అన్నట్లుగా తెలుస్తోంది.కోటబొమ్మాళి పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ ,రాహుల్ ,శివాని రాజశేఖర్ కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికె ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ సాంగ్స్ కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి.

తాజాగా ఈ సినిమా టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది. టీజర్ కూడా అద్వంతం ఆకట్టుకునేలా కనిపిస్తోంది. కథ మొత్తాన్ని రిలీజ్ చేయకుండా ఒక ఆసక్తికరమైన టీజర్ ని విడుదల చేశారు. పొలిటీషియన్ గా మురళీ శర్మ కనిపించారు.. అతడి కింద పనిచేసే పోలీసులు వారితో రాజకీయ నాయకులు చేసేటటువంటి రాజకీయం ఎలా ఉండబోతోంది అనే కథ అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. ఇందులో రామకృష్ణ అనే పాత్రలో శ్రీకాంత్ నటించారు. ఈ సినిమాలో డైలాగులు యాక్షన్ సన్నివేశాలతో శ్రీకాంత్ అదరగొట్టేశారు చాలా సంవత్సరాల తర్వాత తన నట విశ్వరూపంతో శ్రీకాంత్ దుమ్ములేపుతున్నారని చెప్పవచ్చు. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.