రజనీకాంత్ 171 వ చిత్రానికి రెమ్యూనరేషన్ తెలిస్తే నూరేళ్ల పెట్టాల్సిందే..!!

సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఘనత రజనీకాంత్ ది.. రజనీకాంత్ ఇండియాలోనే టాప్ హీరోలలో ఒకరిగా పేరు సంపాదించారు. గత కొద్దిరోజులుగా ఆశించిన స్థాయిలో సక్సెస్ను అందుకో లేకపోయినా రజనీకాంత్ ఇటీవలే వచ్చిన జైలర్ సినిమాతో మళ్లీ భారీ విషయాన్నీ అందుకోవడంతోపాటు రజనీకాంత్ తన స్టామినా అంట మరొకసారి నిరూపించారు.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 600 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని రాబట్టింది. ఈ క్రమంలోనే రజినీకాంత్ తన తదుపరి చిత్రం తలైవా 171 వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిస్తూ ఉండడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రజనీకాంత్ అభిమానులు కూడా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంటుందని చాలా ధీమాతో ఉన్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం వైరల్ గా మారుతోంది. అదేమిటంటే రజినీకాంత్ ఈ చిత్రానికి తీసుకుంటున్న రెమ్యూనరేషన్.

ఈ చిత్రం కోసం దాదాపుగా 250 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఆసియాలోని అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటుడుగా రజనీకాంత్ కి అరుదైన రికార్డు రావడం ఖాయమని తెలుస్తోంది. రజినీకాంత్ జైలర్ సినిమాతో తన స్టామినా నిరూపించడంతో నిర్మాతలు ఇంతటి రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. గతంలో కూడా రజనీకాంత్ జాకీ జాన్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు అంతకుమించి రజనీకాంత్ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు సమాచారం.