హీరోల రెమ్యూనరేషన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన అల్లు అరవింద్..!!

ఏ ఇండస్ట్రీలో నైనా సరే స్టార్ హీరోల రెమ్యూనరేషన్ గురించి ఎప్పుడు హార్ట్ టాపిక్ గా ఏదో ఒక విషయం వైరల్ గా మారుతూ ఉంటుంది.. స్టార్ హీరోలతో స్టార్ డైరెక్టర్ జోడి కట్టారు అంటే చాలు ఆ సినిమా కోసం నిర్మాతలు ఎక్కడి నుంచైనా డబ్బులు తీసుకువచ్చి పెట్టుబడులు పెడుతూ ఉంటారు. గతంలో దాసరి నారాయణరావు గారు బతికున్నన్ని రోజులు హీరోలు దర్శకులు రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలని డిమాండ్ కూడా చేసేవారట.కానీ ప్రస్తుతం పరిస్థితి అ రాలేదు.. స్టార్ హీరోలు సైతం ఇప్పుడు అందనంత ఎత్తులో ఎదిగిపోయారు.

ఇటీ వలే కాలంలో సినిమాల బడ్జెట్ భారీగా పెరిగిపోవడం జరిగింది.ఇందుకు కారణం హీరోలే అని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చెప్పడం జరిగింది. తాజాగా ఒక ఈవెంట్లో ఆయనకు కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి..గీత ఆర్ట్స్ వంటి పెద్ద బ్యానర్లు సినిమాలు తీయకుండా ఎందుకు దూరంగా ఉంటున్నారు.. బడ్జెట్ విషయంలో ఎందుకు జాగ్రత్త పడుతున్నారని ప్రశ్నించగా.. అందుకు అల్లు అరవింద్ ఖర్చు అని ఒక్క మాటలో సమాధానం ఇచ్చేశారు.. ఒక సినిమా ఖర్చులో కేవలం 25 శాతం వరకు స్టార్ హీరోలకే అందుతోందని వారి రెమ్యూనరేషన్ వల్ల ఖర్చు పెరగడం లేదని కానీ భారీ బడ్జెట్ తో తీస్తున్న సినిమాలలో నటిస్తున్న అందువల్ల బడ్జెట్ ఎక్కువ పెరుగుతోందని తన అభిప్రాయంగా తెలిపారు.

ప్రేక్షకులు కూడా తమ హీరో గ్రాండ్ గా సినిమా చేయకపోతే ఆదరించలేదని తెలిపారు..KGF సినిమా గురించి తెలుపుతూ కే జి ఎఫ్ కి ముందు హీరో యశ్ పెద్ద స్టార్ కాదు..కానీ సినిమా భారీ హైప్ పెరిగిపోవడంతో బ్లాక్ బాస్టర్ అయ్యింది. గీత ఆర్ట్స్ నుంచి రెండు పెద్ద సినిమాలు రావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడ్డాయని తెలిపారు.