HBD: అనుష్క శెట్టి అసలు పేరు ఏంటో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందానికి అందం అందుకు తగ్గట్టుగా హైట్ ఉండడంతో ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ అందుకుంది స్టార్ హీరోలతో సమానంగా ఫేమ్ ను సంపాదించుకున్న ఏకైక హీరోయిన్గా పేరు సంపాదించింది అనుష్క.. ఈ రోజున ఈమె బర్తడే సందర్భంగా అనుష్కకి సంబంధించి కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి. అనుష్క కర్ణాటకలోని తులు అనే ప్రాంతంలో జన్మించింది.

Happy Birthday 'Sweety' Anushka Shetty! Fans Of Baahubali Actress Pour In  Wishes As The Star Turns 38

అనుష్క ఇండస్ట్రీలోకి రాకముందు యోగా టీచర్ గా పనిచేసేదట. నాగార్జున పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న సూపర్ సినిమా కోసం హీరోయిన్ కోసం వెతుకుతూ ఉండగా అక్కడ వీరికి అనుష్క పేరు వినిపించిందట. ఈమెను ఒక హోటల్లో కలుసుకొని ఈమె గురించి అన్ని వివరాలు అడిగి తెలుసుకున్న తర్వాత తనకి యాక్టింగ్ డాన్స్ వచ్చా అని ప్రశ్నించగా ఆమె ఏమీ తెలియదని ఒక క్రేజీ ఆన్సర్ తెలిపిందట.. కానీ పూరి జగన్నాథ్ మాత్రం ఏమి అందానికి హైట్ కి ఫిదా అయ్యి సూపర్ సినిమాలు ఈమెని తీసుకోవడం జరిగిందట.

అలా కొద్ది రోజులు అన్నపూర్ణ స్టూడియోలో ఈమెకు యాక్టింగ్ పైన శిక్షణ ఇచ్చి సినిమాలోకి తీసుకోవడం జరిగినట్లు తెలుస్తోంది. అనుష్క అసలు పేరు స్వీటీ.. అయితే సినిమాలో ఈ పేరు బాగుండదని ఈమెకు ఒక మంచి పేరు పెట్టాలని నాగార్జున, పూరి జగన్నాథ్ ఈమెకు అనుష్క అనే పేరు పెట్టడం జరిగింది.. సూపర్ సినిమాలో మిల మిల అనే సాంగ్ ఉన్నది ఈ పాట పాడడానికి ముంబై నుంచి ఒక అమ్మాయి రావడంతో ఆమె పేరు అనుష్క కావడం చేత ఆమె పేరు బాగుంది కదా అని స్వీటీ నుండి అనుష్క శెట్టి పేరు మార్చడం జరిగిందట.