సలార్ మూవీ వాయిదా.. క్లారిటీ ఇచ్చిన మూవీ టీం..

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, ప్రశాంత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ అండ్ ఎంటర్టైనర్ మూవీ సలార్. ఈ సినిమా రెండు పాటలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. క్రిస్మస్ కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు పోటీగా షారుక్‌ డుంకి సినిమా కూడా రిలీజ్ కానుంది. ఇక గతంలో షారుక్ ఖాన్ పఠాన్, జవాన్ సినిమాలతో వరుస బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి వెయ్యి కోట్ల కలెక్షన్ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో షారుఖ్ ఖాన్ డుంకి సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

అదేవిధంగా ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాకు ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో కే జి ఎఫ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రూపొందుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ రెండు సినిమాలు క్రిస్మస్ బరిలో దిగితే ఏ సినిమా సక్సెస్ అందుకుంటుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో మొదట డుంకి సినిమా పోస్ట్ పోన్ అవుతుందంటు న్యూస్ వైరల్ అయింది. దీనికి చెక్ పెడుతూ డుంకి మూవీ టీం మొదట అనౌన్స్ చేసిన తేదీన రిలీజ్ అవుతుందనే క్లారిటీ ఇచ్చేశారు.

దీంతో సలార్ సినిమానే పోస్ట్ పన్‌ చేస్తున్నారు అంటూ న్యూస్ వైరల్ అయింది. దీనిపై తాజాగా సలార్ మూవీ టీం కూడా క్లారిటీ ఇచ్చారు. మూవీ టీం మా టార్గెట్ ఎప్పుడు మిస్ అవ్వకూడదు.. ఎవరికి టార్గెట్ అవ్వకూడదు అంటూ ట్యాగ్ లైన్ ఇచ్చి సినిమా రిలీజ్ డేట్ లో ఎటువంటి చేంజెస్ లేవు. సలార్ డిసెంబర్ 22న థియేటర్స్ లో బ్లాస్ట్‌ అవడం ఖాయం అంటూ స్ప‌స్టంచేశారు మూవీ టీం. అయితే యూఎస్ ప్రాంతంలో ఈ సినిమా ప్రీమియర్ షోలో డిసెంబర్ 21 నుంచి స్టార్ట్ కానున్నాయి. ఇక ప్రభాస్‌ను మాస్ అవతార్‌లో చూసేందుకు ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు. ఈ భారీ ఆక్షన్ ఎంటర్టైనర్లు శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది పృథ్వీరాజ్ జగపతిబాబు శ్రీయ రెడ్డిలు కీలకపాత్రలో నటిస్తున్నారు.