“ఆ మూడు క్వాలిటీస్ ఉన్న మగాడే భర్తగా కావాలి”.. శ్రీలీల మంచి రొమాంటిక్ ఫెలోనే..!

హీరోయిన్ శ్రీ లీల ఏం మాట్లాడినా అది సంచలనంగానే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్గా రాజ్యమేలేస్తున్న శ్రీ లీల రీసెంట్ గానే భగవంత్ కేసరి సినిమాలో నటించి హిట్ కొట్టింది . కాగా ఇప్పుడు ఆమె ఆదికేశవ సినిమాతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధంగా ఉంది .

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీ లీలకు కాబోయే భర్త ఎలా ఉండాలి..? ఆయనకు క్వాలిటీస్ ఏ విధంగా ఉండాలి ..? అంటూ హోస్ట్ ప్రశ్నిస్తారు . దీంతో శ్రీ లీల ప్రప్రధమంగా మూడు క్వాలిటీస్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటూ చెప్పుకొచ్చింది . మొదటి క్వాలిటీ “నన్ను పెళ్లి చేసుకోవాలి అంటే అబ్బాయికి చాలా గట్స్ ఉండాలి “.

“నా విష్ లిస్ట్ చాలా పెద్దదే ఉంది ..నాకు కాబోయే భర్త మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కలిగి ఉండాలి .. మూడో క్వాలిటీ కాస్త ఫ్యామిలీ లుక్స్ లో కనిపించే విధంగా అందంగా పద్ధతిగా ఉండాలి ..మా అమ్మకి బాగా నచ్చాలి ” అంటూ చెప్పుకొచ్చింది . దీంతో శ్రీ లీల మహా రొమాంటిక్ అంటూ జనాలు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు..!!