” కలలో కూడా నేను ఆ పేరును ఊహించుకోలేను “.. వైష్ణవ్ తేజ్ షాకింగ్ కామెంట్స్…!!

మెగా హీరో వైష్ణవ్ తేజ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ” ఉప్పెన ” సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో… ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అంతేకాకుండా ప్రత్యేకమైన ఫాలోయింగ్ సైతం సొంతం చేసుకున్నాడు. అదే ఫామ్ లో రంగరంగ వైభవంగా, కొండ పొలం వంటి సినిమాలలో నటించాడు. ఇక ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ ” ఆది కేశవ ” సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తోంది. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ స్టోర్ సినిమాస్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాతో శ్రీకాంత్ ఎస్ రెడ్డి దర్శకుడుగా పరిచయం కానున్నాడు. ఇక ఈ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు ఈ మూవీ టీమ్‌. ఈ క్రమంలోని వైష్ణవ్ తేజ్ ఆసక్తికర కామెంట్లు చేశాడు. ” ఆదికేశవ సినిమాతో మాస్ హీరోగా పేరు తెచ్చుకోవాలన్న ఉద్దేశం నాకు లేదు. అసలు ఎవరైనా నన్ను హీరో అంటే.. నేను హీరోని కాదు నటుడిని అని చెబుతాను. నిజానికి పవన్ కళ్యాణ్ మావయ్య కూడా నాతో నటుడు అనిపించుకుంటేనే విభాన్న పాత్రలు చేసే అవకాశం ఉంటుందన్నాడు.

యాక్షన్ సన్నివేశాలు కథలో భాగంగానే ఉంటాయి.. వాటిని సాధ్యమైనంత మీరా సహజంగానే చిత్రీకరించాము. ఫైట్స్ ఎక్కడ అతిగా అనిపించవు.. కొడితే 10 మంది గాలిలో ఎగరడం లాంటివి ఉండవు. నా వయసుకి తగ్గట్టుగానే ఫైట్లు ఉంటాయి. నేను మంచి డాన్సర్ ను కాకపోయినా చాలా కష్టపడి ఈ సినిమాలో డాన్సులు చేశాను. డాన్స్ మాస్టర్, శ్రీ లీల మద్దతుతో ఈ సినిమాకి పూర్తి న్యాయం చేయగలిగాను. దర్శకుడు శ్రీకాంత్ కథ చెప్పినప్పుడు ఎంత బాగుందో.. దాన్ని చేస్తుంటే అద్భుతంగా అనిసించింది. నాకు, శ్రీ లీలకు మధ్య వచ్చే సన్నివేశాలు క్యూట్ గా ఉన్నాయి ” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.