ఇండియా ఓటమిని మర్చిపోలేకపోతున్న నవీన్ పోలిశెట్టి .. ఏం చేశాడో తెలుసా(వీడియో)..?

ప్రెసెంట్ కోట్లాదిమంది ఇండియన్స్ ఎంత డిప్రెషన్ కి గురైపోతున్నారో మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా టీం ఇండియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఓడిపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు . ఇన్ని మ్యాచులు గెలిచిన టీమ్ ఇండియా ఫైనల్లీ వరల్డ్ కప్ మ్యాచ్ ఓడిపోవడం అది కూడా తక్కువ స్కోర్కే కావడం ఇప్పుడు అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది.

అయితే పలువురు కావాలని టీమ్ ఇండియా ప్లేయర్స్ ని ట్రోల్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే హీరో నవీన్ పోలిశెట్టి వాళ్లకు ఘాటుగా కౌంటర్ ఇస్తూ ఫన్నీ వీడియోని రిలీజ్ చేశారు . ఈ వీడియోలో నవీన్ పోలిశెట్టి మాట్లాడుతూ ..”అరే వంశీ అదేదో డిప్రెషన్ కోసం టాబ్లెట్ ఉందన్నావ్ .. ఆ టాబ్లెట్ పేరు ఏంట్రా .. నాకోసం కాదురా నా లైఫ్ ఫుల్ జిల్ జిల్ జిగాగా వెళ్ళిపోతుంది.. నా ఫ్రెండ్ కోసం.. డోలో 650 నా ..? అరే నువ్వు నిజంగా ఎంబిబిఎస్ చదివవా..? పేమెంట్ సీటా..? అంటూ ఫన్నీగా ఓ వీడియోని రిలీజ్ చేశారు “.

దీనికి హ్యాష్ ట్యాగ్ 2023 వరల్డ్ కప్ ఫైనల్ అంటూ కూడా ట్యాగ్ చేశారు . అయితే కావాలనే కొందరు టీమిండియా వరల్డ్ కప్ మ్యాచ్ ఓడిపోయిన విషయాన్ని పదే పదే గుర్తు చేస్తున్నారని.. ఇంకెన్ని రోజులు ఇలా గుర్తుచేసి బాధపెడతారని . ఇక వదిలేయండి అంటూ పరోక్షకంగానే చెప్పేసాడు నవీన్ పోలిశెట్టి అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు…!!