దానివల్లే 8 రోజులుగా ఆసుపత్రిలో నరకం అనుభవించ.. స్టార్ హీరోయిన్ కామెంట్స్ వైరల్..

బాలీవుడ్ స్టార్ బ్యూటీ భూమి పడ్నేక‌ర్‌ ఇటీవల ది లేడీ కిల్లర్ అనే క్రైమ్ స్టోరీ లో నటించి ప్రేక్షకులు అభిమానాన్ని సొంతం చేసుకుంది. థాంక్యూ ఫర్ కమింగ్ అనే ఓ బోల్డ్ మూవీలో అర్జున్ కపూర్ సరసన జంటగా నటించింది. ఈ సినిమాకి అజయ్ బహల్ దర్శకత్వం వహించగా నవంబర్ 3న‌ సినిమా రిలీజ్ అయి ఫాజిటీవ్‌ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం అర్జున్ కపూర్, భూమి పడ్నేక‌ర్‌ జంటగా మేరీ పత్రిక రీమేక్ అనే మరో ప్రాజెక్టులో నటిస్తున్నారు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలో కనిపించబోతుంది. ఈ సినిమా ముద్దస్సర్ డైరెక్షన్లో తుర‌కెక్కుతుంది.

అయితే ఇటీవల భూమి పడ్నేక‌ర్ తీవ్ర అనారోగ్యంతో ఎనిమిది రోజులపాటు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించుకున్నట్టు సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫోటోను తన ఇన్స్టాల్ లో షేర్ చేసుకుంటూ.. డెంగ్యూ కారణంగా నేను హాస్పిటల్లో చేరాను. ప్రస్తుతం అంతా సెట్ అయింది అంటూ వివరించింది. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని.. అందరి ఇంట్లో దోమల నివారణకు కావలసిన చర్యలు తీసుకోవాలంటూ వివరించింది. హెవీ పొల్యూషన్ వల్ల మన ఆరోగ్యానికి చాలా ఇబ్బంది కలుగుతుంది అంటూ వివరించింది భూమి.

ఒకే ఒక్క దోమ వల్ల నేను ఎనిమిది రోజులు నరకం చూసా.. దాదాపు వారం తర్వాత ఈ రోజే ఉదయాన్నే లేచా అంటూ వివరించింది. నేను కొన్ని రోజులుగా నా కుటుంబానికి దూరంగా ఉండడం వల్ల చాలా కష్టం అనిపించింది. ప్రతి ఒక్కరూ మస్కిటో కిల్లర్స్ ను ఉపయోగించండి.. మీరు రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి కావలసిన ఆహారాన్ని.. అధిక కాల్షియం ఉన్న ఫుడ్ తీసుకుంటూ ఉండండి. నాకు తెలిసిన చాలా మంది కూడా ఇటీవల డెంగ్యూ కారణంగా చాలా ఇబ్బంది పడ్డారు అంటూ వివరించింది. ఇక తనను చూసుకున్న ఆసుపత్రి సిబ్బందికి కృతజ్ఞతలు చెబుతూ ఆమె పోస్ట్ షేర్ చేసింది.