మోహన్ బాబు పై ఆసక్తికరమైన కామెంట్స్ చేసిన సీనియర్ నటి..!!

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులకు సైతం ఎన్నో రకాల అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని తట్టుకొని నిలబడ్డ వారే ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం వాటిని గుర్తుచేసుకొని ఎన్నో సందర్భాలలో ఎమోషనల్ అయిన సందర్భాలు ఉన్నాయి. మరి కొంతమంది చెప్పుకోవడానికి ఇష్టపడరు కానీ తాజాగా ఇప్పుడు ఒక ప్రముఖ నటి పలు విషయాలను తెలియజేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది .టాలీవుడ్లో సీనియర్ నటిగా పేరుపొందిన జయలక్ష్మి ఎన్నో చిత్రాలలో నటించింది.

జయలక్ష్మి మాట్లాడుతూ తన లైఫ్ లో జరిగిన విషయాలను తెలియజేస్తూ తనకు ఇద్దరు పాపలని జయం సినిమాలో నటించిన అమ్మాయికి హీరోయిన్ గా ఆఫర్లు వచ్చాయి. కానీ అంగీకరించలేదని తన పెద్ద కూతురు పెళ్లి చేశానని తెలిపింది. మా హీరోయిన్ ఎలా ఉందని ఆమె అభిమానులు ఇప్పటికీ అడుగుతూనే ఉంటారని తెలిపింది జయలక్ష్మి. తన చిన్న కూతురు లండన్ లో యానిమేషన్ చేస్తోందని త్వరలోనే సినిమాలలోకి రావచ్చంటూ తెలిపింది. పలు సీరియల్స్ లో నటిస్తున్నప్పుడు అవకాశాలు రానందున ఆరోగ్యం బాగా లేకపోయినా కొన్ని సినిమాలలో నటించానని తెలిపింది.

అలా మోహన్ బాబు నటించిన ఒక సినిమాలో చేశాను అది కూడా దాసరి పద్మా నుంచి తనకు అవకాశం వచ్చిందని ఈ సినిమాలో పైట తీసే సీను ఉందని ఆ సీన్ చేయలేనని చెప్పానని..ఆ తర్వాత మోహన్ బాబు సినిమా ఆఫర్ ని కూడా రిజెక్ట్ చేశానని దీంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారని తెలిపింది.కానీ మోహన్ బాబు మాత్రం తనని ఏమనకుండా ఇంటికి పంపించేశారని తెలిపింది. మోహన్ బాబు అందరితో ముక్కుసూటిగా ఉంటారు.. తన గురించి తెలుసుకొని తన రిజెక్ట్ చేసిన కూడా తనని ఏమనకుండా ఇంటికి పంపించేశారని తెలిపింది జయలక్ష్మి. ఆయన మంచి వ్యక్తి అని తెలిపింది.