ఆ ఒకే ఒక్క విషయంలో సూర్య తర్వాతే ఎవరైనా… నువ్వు నిజంగా కేక బాసు…!!

ప్రస్తుత కాలంలో ఇండస్ట్రీలో చాలామంది హీరో, హీరోయిన్లు సినిమాలు చేస్తున్న సమయంలో ప్రేమలో పడి.. అనంతరం వివాహాలు కూడా చేసుకుంటున్నారు. ఈ దారిలోనే కోలీవుడ్ బ్యూటీ కపుల్స్ జ్యోతిక, సూర్య కూడా ఉన్నారు. పెళ్లి అనంతరం భార్య ఇంట్లో ఉంటే భర్త సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండే వాళ్లు చాలామంది ఉన్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన జ్యోతిక.. మూడు ముళ్ళు అనంతరం సినిమా ఇండస్ట్రీకి దూరమైంది.

కానీ భార్య గురించి పూర్తిగా తెలుసుకుని ఆమెను అదే ఇండస్ట్రీలో ఎంకరేజ్ చేయడం చాలా తక్కువ మంది భర్తలు చేస్తూ ఉంటారు. ఈ లిస్టులో నెంబర్ వన్ పొజిషన్లో సూర్య ఉన్నాడు. జ్యోతికకి ఇండస్ట్రీలో చాలా సపోర్ట్ చేస్తూ తనని ముందుకు నడిపించే క్రమంలో ఎన్నో ప్రయత్నాలు చేశాడు సూర్య. అంతేకాకుండా జ్యోతిక సినిమాలు తీస్తాను అంటే సూర్య డబ్బులు పెట్టి సినిమాల నిర్మాణం కూడా చేయిస్తున్నాడు. తమ కృషికి తగ్గట్టే సక్సెస్ను సైతం తమ ఖాతాలో వేసుకుంటున్నారు.

ఇక జ్యోతిక కూడా తన భర్త సూర్యాను అంతే ప్రేమిస్తూ.. తన ఇద్దరీ పిల్లలను చూసుకుంటూ.. ఒక పక్క ప్రొఫెషనల్ గా ఎదుగుతూ.. బ్యాలెన్స్ లైఫ్ ని కొనసాగిస్తుంది. ఈ ఇద్దరి క్యూట్ కపుల్ గురించి తెలిసిన ప్రేక్షకులు…” భర్త అంటే ఇలా ఉండాలి కదా. భార్యపై అనుమానాలు పెట్టుకుంటున్న ఈ కాలంలో.. భార్య ప్రొఫెషన్ కి ఎంత గౌరవం ఇచ్చాడంటే సూర్య భాయ్ నువ్వు కేక.. మీ ఇద్దరూ శివుడు, పార్వతిల కలకాలం హ్యాపీ గా ఉండాలి ” అంటూ తెగ పొగిడేస్తున్నారు.