Thrivikram birthday spl: త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి కొన్ని ఇంట్ర‌స్టింగ్‌ విషయాలు మీకు తెలుసా..?

టాలీవుడ్ గురూజీ, మాటల మాంత్రికుడు ఈ పేర్లు వినగానే ఠ‌క్కున గుర్తుకు వచ్చేది డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. రచయితగా కెరీర్ స్టార్ట్ చేసి టాలీవుడ్ టాప్ 5 స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా నిలిచిన త్రివిక్రమ్ తన మార్క్ మాటలతో, ప్రాసలతో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ను తెచ్చుకున్నాడు. రైటర్ గా మొదలుపెట్టి దర్శకుడుగా మారి చాలా తక్కువ టైంలోనే టాలీవుడ్ టాప్ డైరెక్టర్గా క్రేజ్‌ద‌క్కించుకున్నాడు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి 24 ఏళ్లు పూర్తి చేసుకున్న త్రివిక్రమ్‌కి నేడు పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికపై అభిమానులు విషెస్ తెలియజేస్తున్నారు.

ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ సినీ కెరీర్ గురించి చాలామందికి తెలుసు. అయితే త్రివిక్ర‌మ్‌ శ్రీనివాస్ వ్యక్తిగత జీవితం గురించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. త్రివిక్రమ్ అసలు పేరు ఆకెళ్ళ నాగ శ్రీనివాస్ శర్మ భీమవరంలో ఆయన పుట్టాడు. అయితే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత ఆయన పేరు త్రివిక్రమ్ గా మారింది. ఆంధ్ర యూనివర్సిటీలో న్యూక్లియర్ సైన్స్ ఎంఎస్సీ గోల్డ్ మెడలిస్ట్. త్రివిక్రమ్ ఇండస్ట్రీలోకి రాకముందు దిల్ రాజు పిల్లలకు ట్యూటర్ గా పనిచేశాడు.

అలా దిల్ రాజు ప‌రిచ‌యంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన త్రివిక్రమ్.. పోసాని కృష్ణ మురళి సారధ్యంలో నాలుగు సంవత్సరాలు పాటు అసిస్టెంట్ డైరెక్టర్గా వ్యవహరించాడు. తర్వాత నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. తను ఈ సినిమా కోసం కాలేజీలో కంప్యూటర్ సైన్స్ అంటూ ఓ పాటను కూడా పాడారు. ఇక సిరివెన్నెల సీతారామశాస్త్రి తమ్ముడు కూతురు సౌజన్యను వివాహం చేసుకున్నాడు త్రివిక్ర‌మ్‌. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.